Share News

APGVB merger : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీజీవీబీ విలీనం

ABN , Publish Date - Dec 18 , 2024 | 04:47 AM

వరంగల్‌ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో సేవలందిస్తున్న ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌(ఏపీజీవీబీ)కు సంబంధించి తెలంగాణలోని బ్రాంచులన్నీ తెలంగాణ గ్రామీణ

APGVB merger : తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీజీవీబీ విలీనం

కేవలం తెలంగాణ వరకే.. ఏపీలో అదే పేరుతో కొనసాగింపు

ఖమ్మం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వరంగల్‌ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో సేవలందిస్తున్న ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌(ఏపీజీవీబీ)కు సంబంధించి తెలంగాణలోని బ్రాంచులన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టీజీబీ)లో విలీనం కానున్నాయి. జనవరి 1నుంచి తెలంగాణలోని ఏపీజీవీబీ బ్రాంచులన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకు పేరుతోనే సేవలందించనున్నాయి. ఇందుకోసం ఏపీజీవీబీ బ్యాంకు బోర్డులను తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మార్చబోతున్నారు. ఈ మార్పుల నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31వరకు తెలంగాణలో ఏపీజీవీబీ సేవలు నిలిచిపోనున్నాయి. ఏటీఎంలు, ఆన్‌లైన్‌ నగదు లావాదేవీలతో పాటు ఇతర బ్యాంకు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించనున్నాయి. ఈ మేరకు ఏపీజీవీబీ ఖమ్మం రీజనల్‌ మేనేజర్‌ మహ్మద్‌ రియాజ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జనవరి 1నుంచి బ్యాంకు పాస్‌పుస్తకాలు, వోచర్లు, డీడీలు, చెక్కు పుస్తకాలను తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ పేరుతోనే జారీ చేస్తామన్నారు. ఇప్పటివరకు కొన్ని జిల్లాలకే పరిమితమైన ఈ బ్యాంకు బ్రాంచులను రాష్ట్రమంతా విస్తరింపజేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Dec 18 , 2024 | 04:48 AM