ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ప్రజలే బీఆర్‌ఎ్‌సను చీల్చి చెండాడారు: జూపల్లి

ABN, Publish Date - Jul 27 , 2024 | 03:20 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామంటూ మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటరిచ్చారు.

హైదరాబాద్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామంటూ మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటరిచ్చారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలే బీఆర్‌ఎ్‌సను చీల్చి చెండాడారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్నాకు పరిమితమైందని అన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.


ప్రజాస్వామ్యమంటే కేసీఆర్‌కు చులకన భావమని, అందువల్లే అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్లలేదని, ప్రతిపక్ష నేతగా ఇన్నాళ్లూ శాసనసభకు రాలేదని విమర్శించారు. తనకంటే చిన్నవాడైన రేవంత్‌రెడ్డి సీఎం కావడాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణను రాజకీయంగా, ఆర్థికంగా ఆగం పట్టించిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఆరోపించారు. లక్ష్మీదేవి రిజర్వాయర్‌ను పూర్తి చేయలేదని, కాళేశ్వరాన్ని కాలగర్భంలో కలిపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jul 27 , 2024 | 03:20 AM

Advertising
Advertising
<