ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Komatireddy Venkata Reddy: కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ వేసే నైతికత బీఆర్‌ఎస్‌కు లేదు

ABN, Publish Date - Dec 09 , 2024 | 04:00 AM

ఏడాది కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ వేసేంత నైతికత బీఆర్‌ఎస్‌కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడగానే దళితుడినే సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పి.. అవి చేయలేకపోయిన కేసీఆర్‌పై అప్పుడు ఎందుకు చార్జ్‌షీట్‌ వేయలేదని మండిపడ్డారు.

  • తెలంగాణ తల్లిపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ విగ్రహావిష్కరణకు వస్తారు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఏడాది కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ వేసేంత నైతికత బీఆర్‌ఎస్‌కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడగానే దళితుడినే సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పి.. అవి చేయలేకపోయిన కేసీఆర్‌పై అప్పుడు ఎందుకు చార్జ్‌షీట్‌ వేయలేదని మండిపడ్డారు. సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాట్లను ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి వికా్‌సరాజ్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఏడాది పాలనపై బీఆర్‌ఎస్‌ చార్జ్‌షీట్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఘాటుగా స్పందించారు.


తెలంగాణ కోసం శ్రీకాంతాచారి చావునోట్లో తలపెట్టి చనిపోయాడని, మరి కేసీఆర్‌ ఎలా బయటపడ్డారో ప్రజలకు తెలుసన్నారు. హరీశ్‌, కేటీఆర్‌లది రాజకీయ ఉనికి కోసం చేసే ఆరాటమే తప్ప.. వారిది నిజమైన ప్రతిపక్ష పాత్రకాదని చెప్పారు. సోమవారం నిర్వహించే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించామని తెలిపారు. తెలంగాణ, తెలంగాణతల్లిపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి వస్తారని, తెలంగాణ అంటే ఇష్టం లేనివారు రారని అన్నారు. నిజమైన తెలంగాణవాదులెవరో తెలిసే వేదిక ఇదేనని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న వేదికలకు సం బంధించి అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. సచివాలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు.

Updated Date - Dec 09 , 2024 | 04:00 AM