ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం: మంత్రి ఉత్తమ్

ABN, Publish Date - May 26 , 2024 | 05:13 PM

బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర రెడ్డి‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తామే పెంచి పోషించామని అన్నారు. ఆయన అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారని అన్నారు.

Minister Uttam Kumar Reddy

హైదరాబాద్: బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర రెడ్డి‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తామే పెంచి పోషించామని అన్నారు. ఆయన అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారని అన్నారు. బీజేపీలో ఓవర్ స్పీడ్‌గా పోవాలని ఆయన అనుకుంటున్నాడన్నారు. ఢిల్లీకి డబ్బులు పంపి ఫ్లోర్ లీడర్ పదవి ఆయనే కొనుక్కున్నారని ఎద్దేవా చేశారు.


ఆదివారం గాంధీభవన్‌లో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ... మాజీ మంత్రి కేటీఆర్, మహేశ్వరరెడ్డి తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.బాధ్యత రాహిత్యమైన ఆరోపణలు చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాయని విరుచుకుపడ్డారు.అబద్ధాలు, అవాస్తవాలను ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నయ పైసా నిజం లేదన్నారు.గత ప్రభుత్వం సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ రూ.58వేల కోట్లు అప్పులు చేసిందని చెప్పారు.


సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌లో గత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.11వేల కోట్లని అన్నారు. గత ప్రభుత్వం కంటే తామే ముందుగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని తెలిపారు.తడిసిన ధాన్యాన్ని ఎమ్మెస్పీ ధరకు కొనాలని విప్లవాత్మక స్టెప్ తీసుకున్నామన్నారు.అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎమ్మెస్పీ ధరకు కొన్న ఏకైక ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. డిఫాల్టర్ రైస్ మిల్లర్ల కోసమే బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడుతోందన్నారు.మిల్లర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విమర్శిస్తున్న నేతలే మిలర్లను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.


బయట ధాన్యం గురించి మాట్లాడి లోపల భూముల విషయం మాట్లాడే సంస్కారం తమది కాదన్నారు. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు కదా కనీసం వాళ్లని తాను కలవలేదని తేల్చిచెప్పారు.తనలాంటి నిజాయితీ పరుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదన్నారు.సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలేదన్నారు.రూ. 42 రూపాయలకు కిలో సన్న బియ్యం అమ్మితే ప్రభుత్వం వెంటనే కొంటుందని తెలిపారు.టెండర్లో ఉన్న కండిషన్స్‌కి ఒప్పుకుంటే ఎంత ధాన్యం అమ్మినా ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు.మిల్లర్లపై ఇంత కఠినంగా ఉన్న ప్రభుత్వం తమదేనని చెప్పుకొచ్చారు. మిల్లర్లలో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: పరిటాల రవి హత్య జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారా.. మల్లు రవి సూటి ప్రశ్నలు

Minister Tummala: నా లక్ష్యం అదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

TG Politics: బీఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారు.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు

TG Politics: మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం: మంత్రి ఉత్తమ్

Read Latest Telangana News and Telugu News

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 09:55 PM

Advertising
Advertising