ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA: బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి..

ABN, Publish Date - Jul 03 , 2024 | 10:33 AM

బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఖైరతాబాద్‌ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్‌(MLA Dana Nagender) సూచించారు.

- ఎమ్మెల్యే దానం నాగేందర్‌

హైదరాబాద్: బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఖైరతాబాద్‌ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్‌(MLA Dana Nagender) సూచించారు. బోనాలను పురస్కరించుకొని మంగళవారం ఆయన నివాసంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ, ఎండోమెంట్‌, పోలీసు, శానిటేషన్‌, ఎంటమాలజీ, వీధి దీపాల విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాలయాల కమిటీల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలయాల వద్ద రోడ్లు, వీధి దీపాలు లేకపోవడంతో ఉత్సవాల ఏర్పాట్లు చేయలేకపోతున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగిపొర్లుతుందని మురుగు నీటిలో వేడుకలు ఎలా జరుపుకోవాలని ప్రశ్నించారు. సమస్యలు చెప్పేందుకు అధికారులకు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని వారు వాపోయారు.

ఇదికూడా చదవండి: Hyderabad: తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైన వారి పిల్లలే టార్గెట్‌.. అల్లాపూర్‌లో కిడ్నాపర్లు?


ఈ సందర్భంగా దానం అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్తీవాసుల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అధికారులు పట్టించుకోకపోతే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ఆలయ కమిటీల సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ డీసీలు జగన్‌, ప్రశాంతి, తహసీల్దార్‌ అనితారెడ్డి, జలమండలి సీజీఎం ప్రభు, జీఎం హరి శంకర్‌, ఈఈలు విజయ్‌కుమార్‌, ఇందిర, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మామిడి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 10:33 AM

Advertising
Advertising