MLA Danam ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..
ABN, Publish Date - Dec 12 , 2024 | 08:34 AM
నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని, ఒకవైపు అభివృద్ధి పనులు, మరోవైపు సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అన్నారు.
హైదరాబాద్: నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని, ఒకవైపు అభివృద్ధి పనులు, మరోవైపు సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Khairatabad MLA Danam Nagender) అన్నారు. బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో రూ.55 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఖైరతాబాద్ మారుతీనగర్‌లో రూ. 25 లక్షల విలువ గల సీవరేజ్ పైప్‌లైన్ పనులతో పాటు హిమాయత్‌నగర్(Himayatnagar)లో రూ. 30 లక్షల విలువ గల సీవరేజ్ పైప్‌లైన్ పనులను ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: JNTU: యూనివర్సిటీనా.. లేక ఆటోనగరా..
ఈ సందర్భంగా దానం మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొదట మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. దాంతో పాటు కోట్లాది రూపాయల ఖర్చుతో రహదారులు, సుందరీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) చొరవతో కేబీఆర్ పార్కు పరిసరాల్లో ప్రత్యేక రహదారులను నిర్మిస్తున్నామన్నారు.
పార్కులతో పాటు అన్ని చౌరస్తాలను సుందరీకరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జలమండలి జీఎం జాన్ షరీఫ్, మేనేజర్ నదీం, మాజీ కార్పొరేటర్లు కృష్ణ యాదవ్, ఎస్‌కే షరీప్ నాయకులు మహేందర్‌బాబు, మహేష్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, ప్రవీణ్ కుమార్, జి.కృష్ణయాదవ్, ప్రసాద్, విశాల్‌బాబు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే
ఈవార్తను కూడా చదవండి: హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనల్లో.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అనుమానాలు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్: కవిత
ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్ అవార్డు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 12 , 2024 | 08:34 AM