ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA: హైడ్రా పేరుతో పేదలను పరేషాన్‌ చేయొద్దు..

ABN, Publish Date - Oct 02 , 2024 | 10:28 AM

హైడ్రా పేరుతో పేద ప్రజలను పరేషాన్‌ చేయొద్దని, లేదంటే బంగ్లాదేశ్‌ ప్రధానికి పట్టిన గతే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) హెచ్చరించారు.

హైదరాబాద్: హైడ్రా పేరుతో పేద ప్రజలను పరేషాన్‌ చేయొద్దని, లేదంటే బంగ్లాదేశ్‌ ప్రధానికి పట్టిన గతే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) హెచ్చరించారు. మంగళవారం కార్పొరేటర్‌ ముద్దం నర్సింహ్మయాదవ్‌తో కలిసి ఓల్డుబోయినపల్లి హస్మత్‌పేట బోయిన్‌చెరువును ఆయన సందర్శించారు. అనంతరం హరిజనబస్తీలో పర్యటించి బస్తీవాసులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శని, ఆదివారాలు వస్తే చెరువు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘జంట’గా గంజాయి విక్రయాలు..


తమ నివాసాలను ఎక్కడ కూల్చివేస్తారోనని కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారన్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే ఊరుకోబోమని తెలిపారు. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు నరేందర్‌గౌడ్‌, మక్కల నర్సింగ్‌రావు, ఇర్ఫాన్‌, సయ్యద్‌ ఎజాజ్‌, హరినాథ్‌, యాదగిరి, పెద్ద సంఖ్యలో హరిజనబస్తీ నివాసితులు పాల్గొన్నారు.


పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి..

హైదర్‌నగర్‌: కూకట్‌పల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కరించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కార్పొరేటర్లు నరసింహయాదవ్‌, సతీష్‏గౌడ్‌, రవీందర్‌రెడ్డి, సబేహా గౌసుద్దీన్‌, రోజారాణి, శిరీష, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్‌ శ్రావణ్‌కుమార్‌ ఉన్నారు.


..........................................................

ఈ వార్తను కూడా చదవండి:

..........................................................

Hyderabad: కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిరక్షణ హైడ్రాకే: దానకిశోర్‌

హైదరాబాద్‌ సిటీ: తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నింటినీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుందని, ఓఆర్‌ఆర్‌ లోపల విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్‌(M. Danakishore) అధికారులను ఆదేశించారు. గవర్నింగ్‌ బాడీ హైడ్రా కోసం ప్రత్యేక పాలసీ రూపకల్పన చేయనున్న నేపథ్యంలో సహకారం అందించేందుకు దానకిషోర్‌ అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (టీసీయూఆర్‌) డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ సబ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.


జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ(GHMC, HMDA), వాటర్‌ వర్క్స్‌, హైడ్రా, రెవెన్యూ, పోలీసు, అటవీ, అగ్నిమాపకశాఖ, మునిసిపాలిటీలు, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా దానకిషోర్‌ మాట్లాడుతూ కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో ఉన్న అన్ని లేక్స్‌ల మ్యాపింగ్‌ కోసం ప్రొఫెషన్‌ ప్రభుత్వ ఏజెన్సీతో స్టడీ చేయించాలన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఫ్లడ్‌, అగ్నిప్రమాదాలు సంభవించే ప్రాంతాలు, ట్రాఫిక్‌ రిలేటెడ్‌ ఆక్రమణలు, వాటర్‌ లాగింగ్‌ తదితర వాటిని మ్యాపింగ్‌ చేపట్టాలన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల ప్రకృతి విపత్తులు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని హైడ్రాకు అందజేయాలని ముఖ్య కార్యదర్శి సూచించారు.


సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్‌ మోహన్‌ డోబ్రియాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, సీఎండీ ముషారఫ్‌ అలీ, వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, కలెక్టర్లు అనుదీప్‌, శశాంక, గౌతమ్‌, వల్లూరు క్రాంతి, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, జాయింట్‌ సీపీ జోయల్‌ డెవిస్‌, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


కలెక్టర్లతో కమిటీ..

ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై నాలుగు జిల్లాల కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేయగా.. కమిటీ చైర్మన్‌గా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక, మిగతావారిని సభ్యులుగా నియమించారు. పది రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని దానకిశోర్‌ సూచించారు. అదేవిధంగా ఓఆర్‌ఆర్‌ లోపల అన్ని ప్రభుత్వ ఆస్తులకు జియో ట్యాగింగ్‌ చేసే బాధ్యతను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలికి అప్పగించారు.


ఇదికూడా చదవండి: హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..

ఇదికూడా చదవండి: రేవంత్‌ సర్కారు.. ఇక ఇంటికే

ఇదికూడా చదవండి: దసరాకు ఏపీఎస్‌ ఆర్టీసీ 1,200 ప్రత్యేక బస్సులు

ఇదికూడా చదవండి: చీపుర్లు, రోకళ్లతో సిద్ధంగా ఉండండి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 02 , 2024 | 10:29 AM