ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG News:హై కమాండ్ నాకు ఆ హామీ ఇచ్చింది.. ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 22 , 2024 | 08:32 PM

భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(MLA Komati Reddy Raj Gopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మునుగోడు క్యాంపు కార్యాలయంలో రాజ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేయడం లేదని పోటీ కోసం దరఖాస్తు చేయలేదని తేల్చిచెప్పారు.

నల్గొండ: భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(MLA Komati Reddy Raj Gopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మునుగోడు క్యాంపు కార్యాలయంలో రాజ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేయడం లేదని పోటీ కోసం దరఖాస్తు చేయలేదని తేల్చిచెప్పారు.

భువనగిరిలో పోటీ చేయాలని అందరూ కోరుతున్నారని.. అధిష్ఠానం ఆదేశిస్తే ఆలోచిస్తానని తెలిపారు. బీజేపీ నుంచి పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చేటప్పుడే హై కమాండ్ తనకు కీలక హామీ ఇచ్చిందని అన్నారు. ఆలస్యమైనా అధిష్ఠానం భవిష్యత్‌లో తనకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తారని పూర్తి నమ్మకం ఉందని వివరించారు. భువనగిరి ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిపిస్తానని తెలిపారు. తన వల్ల భువనగిరి ఎంపీ టికెట్ పెండింగ్‌లో ఉందనడం బాధకరంగా ఉందని చెప్పారు. పదవులు త్యాగం చేసిన చరిత్ర తమదని టికెట్ల కోసం ఏనాడూ పాకులాడలేదని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 22 , 2024 | 08:32 PM

Advertising
Advertising