Share News

TG : కేసీఆర్‌.. ఎక్కువ మాట్లాడితే జైల్లో వేస్తాం

ABN , Publish Date - Apr 28 , 2024 | 05:38 AM

కేసీఆర్‌ ఎక్కువ తక్కువ మాట్లాడితే జైల్లో వేస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవుపలికారు.

TG : కేసీఆర్‌.. ఎక్కువ మాట్లాడితే జైల్లో వేస్తాం

  • మీ అవినీతిని బయటకు తీస్తాం.. తిన్నది కక్కిస్తాం

  • ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి

  • ఫోన్‌ట్యాపింగ్‌, దొంగ ఓట్లతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల గెలుపు

  • కోర్టులో నేరం రుజువైతే వారి సభ్యత్వం రద్దు అవుతుంది

  • జనగామలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

జనగామ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ ఎక్కువ తక్కువ మాట్లాడితే జైల్లో వేస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవుపలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామలో శనివారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ అవినీతిని బయటకు తీసి తిన్నదంతా కక్కిస్తామన్నారు. బిడ్డ కవిత తిహాడ్‌ జైలుకు పోయినా కేసీఆర్‌కు సిగ్గు, శరం లేదని మండిపడ్డారు.


కాళేశ్వరం కూలిపోయిందని, రేపో మాపో కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌, హరీశ్‌రావు జైలుకు పోతారని జోస్యం చెప్పారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని కేసీఆర్‌ను నిలదీశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సను బతికి బట్ట కట్టన్విమని శపథం చేశారు. కాంగ్రెస్‌.. మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డికి కోమటిరెడ్డి సోదరులు తోడైతే ఒక్కరి అడ్రస్‌ కూడా ఉండడని బీఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌, దొంగ ఓట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గెలిచారని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం కోర్టులో రుజువైతే 30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కానుందని అన్నారు. కోర్టు ధర్మం వైపు నిలబడి చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 28 , 2024 | 06:41 AM