MLA: బీసీ కులగణన పేరుతో మోసం చేస్తే ఊరుకోం..
ABN, Publish Date - Nov 09 , 2024 | 08:49 AM
బీసీ కులగణన పేరిట ప్రజలను మోసం చేస్తే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు.
హైదరాబాద్: బీసీ కులగణన పేరిట ప్రజలను మోసం చేస్తే బీఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఇంటి వద్ద జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీ కులగణన సర్వేను స్వాగతిస్తున్నామని, కానీ ఎమ్మెల్యేలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ పెట్టకుండా సొంత నిర్ణయాలతో ప్రభుత్వం సర్వేను చేపట్టడం సరైన పద్ధతి కాదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉన్న అనుమానాలను అడుగుతుంటే ఎమ్మెల్యేగా ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చాయ్ నుంచి చికెన్65 వరకు.. 35% కల్తీయే..
బీసీ సర్వేలో కులం వివరాలు కాకుండా ఆస్తుల వివరాలు, అకౌంట్ వివరాలు అడుగుతున్నారని వారి అనుమానాలను ప్రభుత్వం తీర్చాలని పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం బీఆర్‌ఎస్(BRS) పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బీసీ కులగణనతో పాటుగా ఎస్సీ వర్గీకరణను కూడా చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రంగారావు, సంతోష్, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మెడికల్ రీయింబర్స్‌మెంట్.. ఆన్‌లైన్‌లోనే!
ఈవార్తను కూడా చదవండి: AV Ranganath: బెంగళూరులో ముగిసిన ‘హైడ్రా’ పర్యటన
ఈవార్తను కూడా చదవండి: jeevan Reddy:మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాల్‌కు మరోసారి నోటీసులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటే కుక్కచావే
Read Latest Telangana News and National News
Updated Date - Nov 09 , 2024 | 08:49 AM