TG Politics: మల్లారెడ్డి ఇక నీ అంతు చూస్తా.. ఎమ్మెల్యే రోహిత్ మాస్ వార్నింగ్
ABN, Publish Date - Mar 18 , 2024 | 07:24 PM
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) యూనివర్శిటీలో జరిగిన ఆందోళనలపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (MLA Rohit) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడలు కొడితే హీరోయిజమా.. తాము చేస్తే రౌడీజయమా అని ప్రశ్నించారు. వాళ్లు చేస్తే రాజకీయం..తాము చేస్తే వ్యభిచారమా అని అన్నారు.
హైదరాబాద్: మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి (Mallareddy) చెందిన యూనివర్శిటీలో జరిగిన ఆందోళనలపై మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ (MLA Rohit) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడలు కొడితే హీరోయిజమా.. తాము చేస్తే రౌడీయిజమా అని ప్రశ్నించారు. వాళ్లు చేస్తే రాజకీయం.. తాము చేస్తే వ్యభిచారమా అని ఆయన ప్రశ్నించారు. తాము ప్రజల తరపున పోరాడుతున్నామని తెలిపారు. విద్యార్థుల తరపున పోరాటం చేస్తున్న తమను రౌడీయిజం చేస్తున్నారని అన్న మాటలు ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థుల తరపున ప్రజా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
మంచి విద్యను ఆరోగ్యాన్ని అందించాలని కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నిస్తామని చెప్పారు. విద్య, వైద్యం, రాజకీయంతో విద్యార్థుల పొట్టకొట్టి కోట్లు సంపాదించి నిర్లక్ష్యంగా మాట్లాడే మాటలు ఇక చెల్లవని మల్లారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. కాలేజీలల్లో, హాస్పిటలళ్లో దోచుకున్న పాపపు సొమ్మును బయటకు తీస్తామని మందలించారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన అన్యాయాలను బయటకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేనేజ్ చేయలేరని చెప్పారు. ఫ్రీ హస్పిటల్, ఫ్రీ వైద్యం అంటూ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న మల్లారెడ్డి ఇక నీ ఆగడాలను అడ్డుకట్ట వేస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు.
కాగా... మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో (Mallareddy Agriculture University) విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్థుల చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ హిస్తున్నారని స్టూడెంట్స్ (Students) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ.. విద్యార్థుల చదువు విషయంలో లేదని అగ్రికల్చర్ యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బీఎస్సీ అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన విద్యార్థులు... మల్లారెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు మైనం పల్లి హనుమంత్ రావు కాలేజ్‌కు వచ్చారు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడుతున్న ఆయన.. పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, సత్వరమే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 18 , 2024 | 09:30 PM