MLA: ‘పది’ విద్యార్థులకు బంపరాఫర్ ఇచ్చిన ఎమ్మెల్యే.. అదేంటో తెలిస్తే..
ABN , Publish Date - Dec 03 , 2024 | 08:50 AM
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే మాధవరం(MLA Madhavaram Krishna Rao) కృష్ణారావు అన్నారు. సోమవారం ఓల్డుబోయినపల్లి హస్మత్‌పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
- పది పరీక్షల్లో 10 గ్రేడ్ సాధిస్తే లక్ష పారితోషికం
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే మాధవరం(MLA Madhavaram Krishna Rao) కృష్ణారావు అన్నారు. సోమవారం ఓల్డుబోయినపల్లి హస్మత్‌పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పా టు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ పెళ్లిళ్ల రూటే వేరయా...
అనంతరం బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్, సిర్సస్ ల్యాబ్ సంస్థ ఆర్థిక సాయంతో సమకూర్చిన 8 కంప్యూటర్లను స్కూల్ హెచ్‌ఎం మల్లయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక రంగంలో మరిం త పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతోనే కంప్యూటర్లు ఇచ్చినట్లు చెప్పారు. 2024-25లో విద్యాసంవత్సరంలో పది తరగతి పరీక్షల్లో 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయలు అందజేస్తానని ప్రకటించారు.
విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్న బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్, సిర్సస్ ల్యాబ్స్ సంస్థ నిర్వాహకులు కృష్ణా పొడిశెట్టి, వెంకటేశ్, ప్రేమ్‌కుమార్‌ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు నరేందర్‌గౌడ్, సయ్యద్ ఎజాజ్, జంగయ్య, మక్కల నర్సింగ్, ఇర్పాన్, మేకల హరినాథ్ పాల్గొన్నారు.
షాపులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి..
హైదర్‌నగర్: ఇందిరా పార్కు వద్ద నాయీ బ్రాహ్మణుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం మేడ్చల్ జిల్లా నాయీ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు నర్సింలు ఆధ్వర్యంలో సభ్యులు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao)ను కలిశారు. బీఆర్‌ఎస్ హాయాంలో కేసీఆర్ సెలూన్‌షాపులకు ఉచితంగా కరెంటు ఇస్తే ఈ ప్రభుత్వం బిల్లులు కట్టాలని ఇబ్బందులు పెడుతుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ మీకు అండగా ఉంటుందని, సెలూన్ షాపులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
Read Latest Telangana News and National News