TG Politics: దీపాదాస్ మున్షీతో ముగిసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భేటీ..
ABN, Publish Date - Jun 26 , 2024 | 08:53 PM
తెలంగాణ భవన్(Telangana Bhavan) శబరి బ్లాక్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ(Deepadas Munshi)తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) భేటీ ముగిసింది. సమావేశ అనంతరం బయటకు వచ్చిన దీపదాస్ మున్షీని మీడియా ప్రశ్నించగా.. పార్టీలో ఎవరు అసంతృప్తిగా లేరని, ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పనంటూ బదులిచ్చారు.
ఢిల్లీ: తెలంగాణ భవన్(Telangana Bhavan) శబరి బ్లాక్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ(Deepadas Munshi)తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) భేటీ ముగిసింది. సమావేశ అనంతరం బయటకు వచ్చిన దీపదాస్ మున్షీని మీడియా ప్రశ్నించగా.. పార్టీలో ఎవరు అసంతృప్తిగా లేరని, ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పనంటూ బదులిచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం నిరాకరించారు. తర్వాత మాట్లాడతా అంటూ వెళ్లిపోయారు. భేటీలో ఏం మాట్లాడారనే దానిపై స్పష్టత లేదు.
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి బుజ్జగించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీలో దీపాదాస్ మున్షీతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.
Updated Date - Jun 26 , 2024 | 08:53 PM