ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత షెడ్యూల్ ఇదే..!

ABN, Publish Date - Mar 22 , 2024 | 02:05 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీలో కవిత దినచర్య ఎలా ఉందనే దానిపై పలు కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారం కవిత రోజువారి దినచర్య ఈ విధంగా ఉన్నట్లు తెలుస్తోంది..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈనెల 15వ తేదీన కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ఢిల్లీ తరలించారు. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. ఆమెను ఈనెల 23 వరకు ఈడీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారం రోజులుగా కవిత ఢిల్లీలోని ఈడీ కస్టడీలో ఉంటున్నారు. రేపటితో ఆమె ఈడీ కస్టడీ ముగియనుంది. దీంతో మళ్లీ కస్టడీకి కోరతారా.. లేదా జ్యూడిషియల్ రిమాండ్‌కు కవితను తరలిస్తారా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఈడీ కస్టడీలో కవిత దినచర్య ఎలా ఉందనే దానిపై పలు కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారం కవిత రోజువారి దినచర్య ఈ విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Big Breaking: సుప్రీంలో కవితకు ఎదురుదెబ్బ

రోజువారీ షెడ్యూల్ ఇదే..!

  • ఉదయం 5 గంటలకు లేచిన తర్వాత కొద్దిసేపు వ్యాయామం

  • ఉదయం 6 గంటలకు పేపర్, బుక్స్ రీడింగ్

  • ఉదయం 8 గంటలకు టిఫిన్ (ఇంటి నుంచి)

  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5- ఈడీ విచారణ (మధ్యలో ఒక గంట లంచ్ విరామం)

  • సాయంత్రం 5.30 గంటలకు టీ, పాలు, స్నాక్స్

  • సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యుల ములాఖత్

  • రాత్రి 8 గంటలకు భోజనం

భోజన విరామం తరువాత కవిత కొంత సేపు పుస్తకాలను చదవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నిద్ర పోతున్నట్లు సమాచారం. ఆమె కోరిక మేరకు కవితకు ఈడీ అధికారులు కొన్ని పుస్తకాలు అందజేసినట్లు తెలుస్తోంది. ఉదయం సమయంలో వార్తా పత్రికలను కవిత చదువుతున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులను న్యూస్ పేపర్స్ చదవి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. కవిత ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది.

6 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసేందుకు అనుమ‌తి ల‌భించింది. ఈడీ క‌స్ట‌డీలో ఉన్న క‌విత‌ను 8 మంది క‌ల‌వొచ్చు. వారిలో త‌ల్లి శోభా, కుమారులు ఆదిత్య‌, ఆర్య‌తో పాటు కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసేందుకు కోర్టు అనుమ‌తి ఇచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 02:05 PM

Advertising
Advertising