TG Politics: రోహింగ్యాలకు తెలంగాణను అడ్డాగా మార్చాలనుకుంటున్నారు... మంత్రి ఉత్తమ్‌పై ఎంపీ అర్వింద్ ఫైర్
ABN, Publish Date - Apr 03 , 2024 | 04:44 PM
రోహింగ్యాలకు తెలంగాణను అడ్డాగా మార్చాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అనుకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. కేంద్రం అమలు చేసిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని ఉత్తమ్ అధికారికంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
నిజామాబాద్: రోహింగ్యాలకు తెలంగాణను అడ్డాగా మార్చాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అనుకుంటున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) అన్నారు. బుధవారం నాడు బీజేపీ (BJP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం అమలు చేసిన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని ఉత్తమ్ అధికారికంగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కేవలం మైనార్టీ ఓట్ల కోసం కాంగ్రెస్ (Congress) నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉత్తమ్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
Kavitha: కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసి లాయర్లు, బీజేపీ నేతల ఆశ్చర్యం..
తెలంగాణలో ఆర్టికల్ 786 తీసుకువచ్చే యోచనలో ఉన్నారా? అని ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉండి ఉత్తమ్ ఈ తరహా వ్యాఖ్యలు ఎలా చేస్తారని నిలదీశారు. సత్వరమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బోధన్‌ను దొంగ పాస్‌పోర్టులకు అడ్డాగా మాజీ సీఎం కేసీఆర్ మార్చారని విరుచుకుపడ్డారు. ఉత్తమ్ గడ్డం పెంచినంత మాత్రాన సెక్యులరిజం కాదని.. అసలైన సెక్యులర్ పార్టీ బీజేపీ మాత్రమేనని ఎంపీ అర్వింద్ అన్నారు.
TS Govt: నీటి నిర్వహణపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు.. ఐఏఎస్ అధికారుల నియామకం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 03 , 2024 | 05:15 PM