ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Eatala: అలాంటి వారిని ఉరితీసినా తప్పులేదు..

ABN, Publish Date - Aug 18 , 2024 | 11:02 AM

డాక్టర్లపై దాడులు జరగకుండా పటిష్ఠమైన చట్టాలు తీసుకురావాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. కోల్‌కతాలో జూనియర్‌ మహిళా డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ)తెలంగాణా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన, ర్యాలీలు నిర్వహించారు.

- ఎంపీ ఈటల

హైదరాబాద్: డాక్టర్లపై దాడులు జరగకుండా పటిష్ఠమైన చట్టాలు తీసుకురావాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. కోల్‌కతాలో జూనియర్‌ మహిళా డాక్టర్‌పై హత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ)తెలంగాణా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన, ర్యాలీలు నిర్వహించారు. ఇందిరాపార్కు(Indira Park) వద్ద ధర్నా చేపట్టారు. నగర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లు, జూనియర్‌ డాక్టర్లు వందలాది మంది నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీగా ధర్నా చౌక్‌కు వచ్చి నిరసన తెలిపారు.

ఇదికూడా చదవండి: Tummala Nageswara Rao: దిగజారుడు రాజకీయాలు


వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్‌, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు వి.సంధ్య, పీడబ్ల్యూ అధ్యక్షురాలు ఝాన్సీ, ఐఎఫ్టీయూ నాయకురాలు అరుణ తదితరులు హాజరై వైద్యులకు మద్దతు తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) మాట్లాడుతూ.. చట్టాలను సవరించి అయినా మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా ఉరితీసినా తప్పులేదన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ పి.కాళీప్రసాదరావు, ప్రధానకార్యదర్శి డాక్టర్‌ విజయారావు. ఫైనాన్స్‌ సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌ కే యాదవ్‌, జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ దయాళ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.


................................................................................

ఈ వార్తను కూడా చదవండి:

....................................................................................

Hussainsagar: హుస్సేన్‌సాగర్‌ గేట్‌ ఎత్తివేత

- నీటిని కిందకి వదిలిన అధికారులు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్‌సాగర్‌(Hussainsagar)లోకి వరద నీటి ప్రవాహం పెరిగింది. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 అడుగులు కాగా.. శనివారం ఉదయం వరకు 513.53 వరకు పెరగడంతో తూము గేట్‌ను 2 ఫీట్ల పైకి ఎత్తి నీటిని నాలా ద్వారా దిగువకు వదిలారు. హుస్సేన్‌సాగర్‌లోకి పైనుంచి వస్తున్న వరద ఉధృతిని ఇంజనీరింగ్‌ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఇన్‌ ఫ్లో 2,075 క్యూసెక్కులు కాగా.. 1,538 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 18 , 2024 | 11:05 AM

Advertising
Advertising
<