ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Raghunandan: మీ ఇళ్లను ఎవ్వరూ కూల్చరు.. బీజేపీ మీకు అండగా ఉంటుంది

ABN, Publish Date - Oct 23 , 2024 | 10:02 AM

‘‘భయపడకండి.. మీ ఇళ్లను ఎవ్వరూ కూల్చరు.. మీకు బీజేపీ అండగా ఉంటుందని గోల్నాక డివిజన్‌లోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఆ పార్టీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు(Medak MP Raghunandan Rao) భరోసా ఇచ్చారు.

- మూసీ పరివాహక ప్రాంతవాసులకు మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు హామీ

హైదరాబాద్: ‘‘భయపడకండి.. మీ ఇళ్లను ఎవ్వరూ కూల్చరు.. మీకు బీజేపీ అండగా ఉంటుందని గోల్నాక డివిజన్‌లోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఆ పార్టీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు(Medak MP Raghunandan Rao) భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం రఘు నందన్‌రావు మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్‌, బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, పార్టీ హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతమ్‌రావు, కార్పొరేటర్లు, పార్టీ నేతలలో కలిసి గోల్నాక డివిజన్‌లోని కృష్ణానగర్‌, తులసీ రాంనగర్‌(లంక) తదితర మూసీ పరివాక ప్రాంతాల్లో పర్యటించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇక ‘హైడ్రా’ హడలెత్తించనుందా?


బీజేపీ అధిష్టానం ఆదేశం మేరకు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో భయాన్ని పోగొట్టి భరోసా కల్పించేందుకు వ చ్చామన్నారు. బాధితులతో మాట్లాడి వారి గోడు విన్నారు. తమకు నాయం చేయాలని, తాము ఇళ్లను వదిలి ఎక్కడికీ వెళ్లే ప్రసక్తే లేదని బాధితులు తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న స్థితిలో మూసీ సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా మూసీ ప్రస్తుతం ఉన్న విధంగానే సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. మీ ఇళ్లు ఎవ్వరూ కూల్చరు, మీకు బీజేపీ అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు.


ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మూసీకి రటర్నింగ్‌ వాల్‌ నిర్మాణం చేసి పేదల ఇళ్లకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకునేలా తమ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందన్నారు. పేదల విషయంలో రాజకీయాలొద్దు, అందరం వారికి న్యాయం జరిగేలా పనిచేద్దామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఆయన సూచించారు. కార్పొరేటర్లు కన్నె ఉమారమేష్ యాదవ్‌, వై.అమృత, బీజేపీ నాయకులు వనం రమేష్‌, ఏడెల్లి అజయ్‌కుమార్‌, కన్నెరమే్‌షయాదవ్‌, మూల రవీందర్‌గౌడ్‌, ఎం.శ్యామ్‌రాజ్‌, కేసరి నర్సింగ్‌రావు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: BRS Leaders : కేటీఆర్‌, హరీశ్‌రావుకు ప్రాణహని!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2024 | 10:02 AM