ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jetwani: టెర్రరిస్ట్‌లా ట్రీట్‌ చేశారు..

ABN, Publish Date - Sep 10 , 2024 | 03:56 AM

గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులు తన పట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరి జెత్వానీ ఆరోపించారు.

  • పీఎ్‌సఆర్‌, కాంతిరాణా, గున్నీపై చర్యలు తీసుకోవాలి: నటి జెత్వానీ

విజయవాడ(ధర్నాచౌక్‌), సెప్టెంబరు 9: గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులు తన పట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరి జెత్వానీ ఆరోపించారు. తనను ఒక టెర్రరిస్టుగా ట్రీట్‌ చేశారని, తన క్యారెక్టర్‌ను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల దారుణంగా వ్యవహరించిన పోలీసు అధికారులు పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. సోమవారం విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. కుక్కల విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఒక మహిళ పట్ల దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు. అప్పటి పోలీసులు విద్యాసాగర్‌కు కొమ్ముకాశారని ఆరోపించారు.


దుబాయ్‌లో ఉన్న తన సోదరుడిని కూడా ఇబ్బంది పెట్టారని చెప్పారు. తనపై ఎటువంటి క్రిమినల్‌ కేసులు లేవని స్పష్టం చేశారు. విద్యాసాగర్‌ తనను బ్లాక్‌మెయిల్‌ చేశారని ఆరోపించారు. అతనిపై 2015 నాటికే 18 క్రిమినల్‌ కేసులు ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు తనకు న్యాయం చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లకు పోలీసులు తన బాధను అర్థం చేసుకున్నారన్నారు. వరదల కారణంగా ప్రస్తుతం పోలీసులు సహాయ కార్యక్రమాలు అందించే పనిలో నిమగ్నమయ్యారన్నారు. తనను వేధించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు మద్దతిచ్చిన మహిళా సంఘాలకు జెత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సంఘాల జేఏసీ నేతలు మాట్లాడుతూ... జెత్వానీ కేసును న్యాయ విచారణ చేయించాలని, ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించిన పోలీసు ఉన్నతాధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేఽశారు.

Updated Date - Sep 10 , 2024 | 03:56 AM

Advertising
Advertising