ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mancherial: బీఆర్‌ఎస్‌ నేత భవనం కూల్చివేత..

ABN, Publish Date - Sep 20 , 2024 | 03:21 AM

బీఆర్‌ఎస్‌ నేత ఒకరు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అసైన్డ్‌ భూమిలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని మున్సిపల్‌ అధికారులు గురువారం కూల్చివేశారు.

  • అనుమతులు ఓ చోట.. నిర్మాణం అసైన్డ్‌ భూమిలో

  • 2 సార్లు నోటీసులిచ్చినా స్పందించని వైనం

  • మంచిర్యాలలో 5 అంతస్తుల భవంతి కూల్చివేత

మంచిర్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేత ఒకరు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అసైన్డ్‌ భూమిలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని మున్సిపల్‌ అధికారులు గురువారం కూల్చివేశారు. బీఆర్‌ఎస్‌ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ (తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం) నేత ఢీకొండ అన్నయ్య మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని కలెక్టరేట్‌ రోడ్డులోని సర్వే నం.40లో రెండు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. రెండేళ్ల క్రితం భవన నిర్మాణానికి అవసరమైన మున్సిపల్‌ అనుమతులు, ఇతర పర్మిషన్లు అదే సర్వే నంబర్‌పై తీసుకున్నారు.


అయితే, అనుమతులు తీసుకున్న స్థలంలో కాకుండా ప్రభుత్వ స్థలమైన సర్వే నం.42లో ఐదంతస్థుల భవన నిర్మాణాన్ని చేపట్టగా, ఆ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ 2022లో మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. పట్టించుకోకపోవడంతో 15 రోజుల క్రితం మళ్లీ నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో గురువారం భారీ పోలీసు బందోబస్తు నడుమ, రెవెన్యూ శాఖ సహకారంతో భవనాన్ని కూల్చివేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సతీష్‌ తెలిపారు.

Updated Date - Sep 20 , 2024 | 03:21 AM