ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telemedicine: హలో.. అమెరికా డాక్టర్‌!

ABN, Publish Date - Jul 28 , 2024 | 04:54 AM

ఒక వైద్యుడు ఏదైనా వ్యాధి నిర్ధారణ చేస్తే రోగులు రెండో అభిప్రాయం (సెకండ్‌ ఓపీనియన్‌) కోసం మరో వైద్యుడిని సంప్రదిస్తుంటారు. అయితే, మన దేశంలో కాస్త డబ్బున్న ఇలాంటివారు ఏటా కోటిమంది క్లిష్టమైన జబ్బులపై సలహా కోసం అమెరికాలోని వైద్యుల వద్దకు వెళ్తున్నారు.

  • భారత్‌ నుంచే ‘రెండో అభిప్రాయం’ సేవలు

  • రోగుల కోసం టెలీ మెడిసిన్‌ సర్వీస్‌ షురూ

  • డబ్బు, సమయం ఆదా.. సేవలు సులువు

  • మన దేశంలోని ఏటా కోటిమందికి మేలు

హైదరాబాద్‌ సిటీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఒక వైద్యుడు ఏదైనా వ్యాధి నిర్ధారణ చేస్తే రోగులు రెండో అభిప్రాయం (సెకండ్‌ ఓపీనియన్‌) కోసం మరో వైద్యుడిని సంప్రదిస్తుంటారు. అయితే, మన దేశంలో కాస్త డబ్బున్న ఇలాంటివారు ఏటా కోటిమంది క్లిష్టమైన జబ్బులపై సలహా కోసం అమెరికాలోని వైద్యుల వద్దకు వెళ్తున్నారు. భారీగా ఖర్చుపెట్టి ప్రయాణం చేయడంతో పాటు అపాయింట్‌మెంట్‌ కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ఇకపై ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సంప్రందించి, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ మేరకు భారతీయ రోగులు అగ్ర రాజ్య వైద్యులతో సులువుగా అనుసంధానమయ్యేలా 50 మంది స్పెషలిస్ట్‌, సూపర్‌ స్పెషలిస్ట్‌ వైద్యులతో కూడిన ‘మై అమెరికన్‌ డాక్టర్‌’ పేరుతో టెలీ మెడిసిన్‌ సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది.


ఈ సేవలను హైదరాబాద్‌లో శనివారం ‘మై అమెరికన్‌ డాక్టర్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌’ సీఈవో రాజ్‌ నార్ల ప్రారంభించారు. అమెరికా వెళ్లిన రోగులకు వైద్యుడి అపాయింట్‌మెంట్‌కు కనీసం వారం నుంచి ఆరు నెలలు పడుతుందని, ఫీజు 500 డాలర్ల వరకు ఉంటుందని, అదే టెలీ మెడిసిన్‌ ద్వారా సంప్రందిస్తే ఒకటి, రెండు రోజుల్లో మాట్లాడే అవకాశం ఉంటుందని వివరించా రు. సంక్లిష్ట వైద్యపరిస్థితులు, అరుదైన వ్యాధులు, కష్టమైన రోగ నిర్ధారణ, వ్యక్తిగత గోప్యత కారణాలతో ఏటా కోటి మంది రోగులు భారత్‌ నుంచి విదేశాలకు వెళ్తున్నారని చెప్పా రు. 72 గంటలలో నివేదిక రూపొందించి రోగులకు అందిస్తామన్నారు.


టెలీ కన్సల్టెంట్‌ను 149 డాలర్లకు, ఫాలో-అ్‌పనకు కన్సల్టెంట్‌ ధరలో సగం ధర నిర్ణయించామని వివరించారు. ఠీఠీఠీ.ఝడ్చఝ్ఛటజీఛ్చిుఽఛీౌఛ్టిౌట.ఛిౌఝ కి లాగిన్‌ అయి అమెరికన్‌ వైద్యుడిని సంప్రదించవచ్చన్నారు. డాక్టర్‌ ఎంపి క, అపాయింట్‌మెంట్‌, వైద్య నివేదికల అప్‌లోడ్‌, డబ్బు చెల్లింపులు అన్నీ ఆన్‌లైన్‌లోనే చేయవచ్చన్నారు. ఒకే వేదికపై స్పెషలిస్ట్‌ వైద్య నిపుణుల సేవలు లభిస్తాయని రాజ్‌ నార్ల చెప్పారు. మై అమెరికన్‌ డాక్టర్‌ బృందంలో సహ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో డాక్టర్‌ రాజేందర్‌ నార్ల, ఎండీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దీపక్‌ థామస్‌, ఎండీ, సీవోవో డాక్టర్‌ హృషికేష్‌ జి, ఎండీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ డాక్టర్‌ సురే్‌షరెడ్డి తదితరులున్నట్లు చెప్పారు.


  • 50 శాతం మంది చికిత్సలో మార్పులు

రెండో అభిప్రాయం తీసుకోవడంవల్ల చికిత్సలో మార్పులు చేసుకున్నట్లు ఓ సంస్థ గతంలో నిర్వహించిన సర్వేలో తేలిందని ‘మై అమెరికన్‌ డాక్టర్‌’ నిర్వాహుకులు చెప్పారు. 270 మందిపై జరిపిన అధ్యయనంలో 50 శాతం కంటే ఎక్కువ కేసుల్లో రెండో అభిప్రాయం తర్వాత రోగ నిర్ధారణలో మార్పుఉన్నట్లు తేలిందన్నారు. కార్యక్రమంలో మై అమెరికన్‌ డాక్టర్‌ అడిక్షన్‌ మెడిసిన్‌, ఇంటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్టు సభ్యుడు డాక్టర్‌ యోగి గుండంరాజ్‌, బోర్డు సభ్యులు డాక్టర్‌ రాజన్‌గార్గ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 04:54 AM

Advertising
Advertising
<