ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర.. భారీ ప్లాన్ చేసిన సీఎం రేవంత్

ABN, Publish Date - Nov 08 , 2024 | 05:14 PM

నవంబర్ 8వ తేదీ నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలను సీఎం రేవంత్‌రెడ్డి చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ముఖ్యమంత్రి పర్యటన షురూ అయింది.

యాదాద్రి: మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(శుక్రవారం) ప్రారంభించారు. వలిగొండ మండలం సంగెం నుంచి సీఎం రేవంత్‌ పాదయాత్ర చేపట్టారు. సంగెం నుంచి భీమలింగం వరకు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. స్థానిక రైతుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకోనున్నారు. భీమలింగం నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి ఈ పాదయాత్ర సాగనుంది. నాగిరెడ్డిపల్లిలో సాయంత్రం ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వాలో భీమలింగానికి అభిషేకం చేసి సీఎం ప్రత్యేక పూజలు చేశారు. బోట్‌లోకి దిగి మూసీ కాలుష్య జలాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.


అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు...

మూసీ పునరుజ్జీవం యాత్రతో మూసీ పరివాహక ప్రజల వద్దకు సీఎం వెళ్లనున్నారు. తన జన్మదినం నవంబర్ 8 నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో వరుసగా జిల్లా పర్యటనలు చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ముఖ్యమంత్రి పర్యటన మొదలైంది. ఈరోజు కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుడిని దర్శించుకుని సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు.


పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన

అనంతరం వైటీడీఏ (YTDA), జిల్లా అధికారులతో ఆలయ అభివృద్ధి పనులపై రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వంతెన వరకు సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్రను ప్రారంభించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర సాగనుంది. మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యవేక్షిస్తున్నారు.


బీఆర్‌ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్..

కాగా.. ఇటీవల మూసీకి సంబంధించి బీఆర్‌ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడే బీఆర్‌ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవనం కోసం ప్రయత్నాలు చేయడం, మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కూడా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ప్రాజెక్టు కోసం డిజైన్ కూడా చేశారు. అయితే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళనే తప్పు అన్నట్టుగా బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆందోళనను సీఎం రేవంత్ తప్పుబట్టారు. మూసీ సుందరీకరణపై సూచనలు ఇవ్వాలని.. అంతేకానీ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. మూసీ మురికిలో ఉండేందుకు ప్రజలు ఎవరూ సుముఖంగా లేరని అన్నారు. అక్కడున్న వారికి న్యాయం చేసేందుకు సూచనలు ఇవ్వాలని.. అంతే కానీ ఆందోళనలు చేయడం తగదన్నారు. ప్రజలంతా మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారని తెలిపారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాడపల్లి నుంచి తాను చేస్తున్న పాదయాత్రకు కలిసి రావాలని.. నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా లేదా అని వారినే అడిగి తెలుసుకుందామని సవాల్ విసిరారు. అనట్లుగానే ఈనెల 8 నుంచి మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్రను చేసేందుకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారు.


ముందస్తు అరెస్టులు..

అనంతరం హైదరాబాద్‌‌కు సీఎం రేవంత్ తిరుగు ప్రయాణం అవుతారు. అయితే మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. వలిగొండ మండలంలో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగుకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీశ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగానూ పలువురు ప్రముఖులు అభినందనల జల్లు కురిపిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

Bandi sanjay: తెలంగాణలో యాక్టివ్ సీఎం కేటీఆరే.. బండి సెన్సేషనల్ కామెంట్స్

KTR: మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 05:38 PM