ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: ఫార్చునర్ వాహనం ఢీకొని బైకర్ మృతి

ABN, Publish Date - Sep 15 , 2024 | 08:57 PM

గరిడేపల్లి శివారులో ఫార్చునర్ వాహనం ఢీకొని ఓ బైకర్ మృతి చెందాడు. మృతుడు వెంకట్రామపురంకు చెందిన కీసర జీడయ్యగా గుర్తించారు. దీంతో గ్రామస్థులంతా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సూర్యాపేట: గరిడేపల్లి శివారులో వేగంగా వచ్చిన ఓ ఫార్చునర్ కారు ఢీకొని ఓ బైకర్ మృతి చెందాడు. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన ఫార్చునర్ వాహనం బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాధితుడు వెంకట్రామపురంకు చెందిన కీసర జీడయ్య(42)గా స్థానికులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

జీడయ్య మృతిచెందడంపై వెంకట్రామపురం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. నష్టపరిహారంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టడంతో కోదాడ- మిర్యాలగూడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Updated Date - Sep 15 , 2024 | 10:06 PM

Advertising
Advertising