TG NEWS: నీటి వాటర్ ట్యాంక్‌ను చూసి జనం షాక్.. అందులో చూస్తే...!?
ABN, Publish Date - Jun 03 , 2024 | 09:23 PM
నీటి వాటర్ ట్యాంక్‌ను చూసి జనం షాక్‌కు గురయ్యారు. అందులో ఏముందని చూస్తే అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీరా అందులో మృతదేహం ఉందని చూసి భయాందోళనలకు గురవుతున్నారు.
నల్గొండ: నీటి వాటర్ ట్యాంక్‌ను చూసి జనం షాక్‌కు గురయ్యారు. అందులో ఏముందని చూస్తే అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తీరా అందులో మృతదేహం ఉందని చూసి భయాందోళనలకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్‌లో మృతదేహం లభ్యమైంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.వాటర్ ట్యాంకులో మృతదేహం పడి ఉన్న అదే నీళ్లను గత 10 రోజులుగా మున్సిపాలిటీలోని పలు వార్డు ప్రజలు తాగుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ నీరు తాగిన వారు కొంతమంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో మున్సిపాల్టీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వాటర్ ట్యాంకును పరిశీలించడంతో అసలు విషయం బయట పడింది.
తాగునీరు తేడాగా ఉండడంతో 11 వార్డు ప్రజలు వాటర్ వదిలే సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు మున్సిపాలిటీ సిబ్బందిని ప్రశ్నించడంతో ట్యాంక్‌లో ఉన్న నీటిని పరిశీలించారు. ట్యాంకులో మృతదేహం చూసి వారంతా షాక్‌కు గురయ్యారు. గతంలోనూ నాగార్జునసాగర్ మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్‌లో పడి కోతులు మృతి చెందిన విషయం తెలిసిందే. నీళ్ల ట్యాక్‌లోని మృతదేహం హనుమాన్ నగర్‌కి చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. గత నెల 24 వ తేదీన సదరు వ్యక్తి కనబడట్లేదంటూ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ట్యాంకులో వంశీ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి పోలీసులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. వంశీ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే అతని కోసం గత కొన్ని రోజులుగా పోలీసులు, కుటుంబ సభ్యులు వెతకని ప్రాంతాలు లేవు. చివరకు విగతాజీవిగా వంశీ కనపడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కంటతడి పెట్టారు.అయితే వంశీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చుట్టూరా ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
Delhi Liquor Scam::కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన ఈడీ.. సంచలన విషయాలు వెలుగులోకి..!
CM Revanth: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ మారింది!
Delhi Liquor Scam:: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు
For More Telangana News and Telugu News..
Updated Date - Jun 03 , 2024 | 09:57 PM