Nampally Court: పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు
ABN, Publish Date - Aug 22 , 2024 | 02:55 AM
బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొలగించనుందని ప్రచారం చేయడం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ చేయడం, బండి సంజయ్ తదితర బీజేపీ నేతలను అసభ్యపదజాలంతో దూషించడంతో రేవంత్ రెడ్డి పరువు నష్టం కలిగించారంటూ బీజేపీ ప్రధాన కార్యరద్శి కాసం వెంకటేశ్వర్లు, అజయ్‌కుమార్ తదితరులు నాంపల్లిలోని న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు.
ఈ ఫిర్యాదును కోర్టు స్వీకరించడకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం వీలైనంత త్వరగా సదరు ప్రైవేటు ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని స్థానిక కోర్టును ఆదేశించింది. ఈ మేరకు నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు బీజేపీ నేతలు దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదుపై విచారణ చేపట్టి సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
Updated Date - Aug 22 , 2024 | 02:55 AM