ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kothagudem: కార్పొరేషన్‌గా కొత్తగూడెం!

ABN, Publish Date - Dec 17 , 2024 | 05:53 AM

రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు ఉండగా.. కొత్తగూడెం పురపాలక సంస్థను నగర పాలక సంస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

  • కొత్తగూడెం, పాల్వంచ మునిసిపాలిటీలు కలిపి ఏర్పాటు

  • మొత్తం నాలుగు మండలాల్లోని 35 గ్రామ పంచాయతీల విలీనం

  • సర్కారు పరిశీలనలో ప్రతిపాదనలు త్వరలో ప్రకటన జారీకి అవకాశం

హైదరాబాద్‌, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్లు ఉండగా.. కొత్తగూడెం పురపాలక సంస్థను నగర పాలక సంస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సర్కారు పరిశీలిస్తోంది. ప్రస్తుతం పురపాలక సంస్థలుగా ఉన్న కొత్తగూడెం, పాల్పంచతోపాటు నాలుగు మండలాల్లోని 35 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేసే అవకాశం ఉంది. చుంచుపల్లి మండలంలోని 3 ఇంక్లైన్‌, 4 ఇంక్లైన్‌, బాబు క్యాంప్‌, చుంచుపల్లి (పిటి), ధన్‌బాద్‌, గౌతంపూర్‌, ఎన్‌కే.నగర్‌ (బదావత్‌ తండా), నంద తండా, పెనుబల్లి, ప్రశాంతినగర్‌, రామాంజనేయ కాలనీ, రుద్రంపూర్‌, వెంకటేశ్వరకాలనీ, విద్యానగర్‌ కాలనీ పంచాయతీలు, లక్ష్మీదేవిపల్లి మండలంలోని అశోక్‌నగర్‌ కాలనీ, చాటకొండ (ఆర్‌), హమాలీకాలనీ, లక్ష్మీదేవిపల్లి, లోతువాగు, ప్రశాంత్‌ నగర్‌, సంజయ్‌ నగర్‌, సాతివారిగూడెం, శేషగిరినగర్‌, శ్రీనగర్‌ కాలనీ పంచాయతీలు, పాల్వంచ మండలంలోని బసవతారక కాలనీ, జగన్నాథపురం, కేశవపురం, లక్ష్మీదేవిపల్లి (ఎస్‌), సుజాతానగర్‌ మండలంలోని 2ఇంక్లైన్‌ (హెడ్‌ క్వార్టర్‌), కోమటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట, నాయకులగూడెం, సుజాతానగర్‌ పంచాయతీలు కార్పొరేషన్‌లో విలీనం కానున్నాయి.


ప్రస్తుతం కొత్తగూడెం మునిసిపాలిటీ పరిధిలో 97,337 మంది ఉండగా, పాల్వంచ పరిధిలో 89721 మంది నివసిస్తున్నారు. సుజాతానగర్‌ మండలంలోని ప్రతిపాదిత 7 పంచాయతీల పరిధిలో 11,124, చుంచుపల్లిలోని 14 పంచాయతీల పరిధిలో 41,860, లక్ష్మీదేవిపల్లి మండలంలోని 10 పంచాయతీల్లో 21,432, పాల్వంచలోని నాలుగు పంచాయతీల్లో 5,903 మంది నివసిస్తున్నారు. రెండు మునిసిపాలిటీలతోపాటు పంచాయతీలు కలిపితే మొత్తం జనాభా 2,67,337కి చేరుతుంది. కొత్తగా విలీనం కానున్న 35 పంచాయతీల్లో ఏడుగురు సర్పంచ్‌ల పదవీకాలం 28 నెలలు ఉండగా.. మిగతా 28 పంచాయతీల పదవీకాలం ఐదారు నెలల్లో ముగియనుంది. కార్పొరేషన్‌ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెంను నగర పాలక సంస్థగా ఉన్నతీకరించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్‌ను కోరగా.. తప్పకుండా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త కార్పొరేషన్‌ ఏర్పాటు విషయాన్ని త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నట్లు తెలిసింది.

Updated Date - Dec 17 , 2024 | 05:53 AM