ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రాథమిక పాఠశాలలకు నూతన ఉపాధ్యాయ సంఘం

ABN, Publish Date - Dec 23 , 2024 | 03:32 AM

ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ సంఘం(పీఎ్‌సటీయూ) నూతనంగా ఆవిర్భవించింది. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆవిర్భావ సమావేశం నిర్వహించారు.

  • ఎస్‌జీటీ పేరును ప్రైమరీ గ్రేడ్‌ టీచర్స్‌గా మార్చాలని డిమాండ్‌

బర్కత్‌పుర, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ సంఘం(పీఎ్‌సటీయూ) నూతనంగా ఆవిర్భవించింది. బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా శిరందాసు రామదాసు, ప్రధాన కార్యదర్శిగా పి.రవికుమార్‌, కోశాధికారిగా పానుగంటి నర్సింహాచారి, ఉపాధ్యక్షుడిగా కె.విద్యాసాగర్‌రెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ వేద ప్రసాద్‌జోషి, మహిళా కార్యదర్శిగా ఎల్‌.భవాని, కార్యదర్శిగా కె.గిరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శిరందాసు రామదాసు మాట్లాడుతూ.. ఎస్‌జీటీ పేరును ప్రైమరీ గ్రేడ్‌ టీచర్స్‌గా మార్చాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 03:32 AM