PM Modi: జగిత్యాలలో మోదీ అదిరిపోయే స్పీచ్..!
ABN, Publish Date - Mar 18 , 2024 | 11:37 AM
Modi Public Meeting In Jagtial హ్యాట్రిక్ కొట్టాల్సిందే.. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందేనని ప్రధాని మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు విచ్చేసిన మోదీ.. రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు..
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..!
ఏపీ కోసం.. తెలంగాణ కోసం.. వికసిత్ భారత్ కోసం 400 సీట్లు కావాలి
400 దాటాలి.. బీజేపికి ఓటు వేయాలి.. అని తెలుగులో చెప్పిన మోదీ
తెలంగాణలో బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొట్టుకుపోతాయి
లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కనుమరుగవుతాయి
రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ తెలంగాణ
తెలంగాణను దోచుకున్న వారిని వదిలేది లేదు.. ఇది మోదీ గ్యారెంటీ
బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు
కాళేశ్వరం అవినీతి విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి
ఆ రెండు పార్టీలు నన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నాయి
దొంగ అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాపై విమర్శలు చేస్తున్నాయి
దేశంలో కుంభకోణాల వెనుకు కుటుంబపార్టీలే ఉన్నాయి.. అవేంటో మీకు తెలుసు
యూపీఏ హయాంలోని స్కామ్‌లను ఎకరువు పెట్టిన మోదీ
కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాల చేస్తున్నాయి
కాళేశ్వరంలో అవినీతి చేసిన బీఆర్‌ఎస్.. లిక్కర్ స్కామ్‌లోనూ కమీషన్లు తీసుకుంది
మాకు అధికారం కంటే.. ప్రజా సంక్షేమమే ముఖ్యం
కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకే రాజకీయాలు చేస్తాయి
దేశంలో ఏ దోపిడీని చూసినా.. దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయి
2 జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది.. అది కుటుంబ పార్టీనే..!
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పేరు బయటకు వచ్చింది.. అది కుటుంబ పార్టీనే! : మోదీ
మల్కాజ్‌గిరి మనదే..!
దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోంది
మే 13న ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నారు
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం వేలకోట్లు ఖర్చు చేసింది
తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం
అందుకే తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి కనబడుతోంది
మల్కాజ్‌గిరిలో బీజేపీ పట్టం కట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు
జూన్ 4న 400 సీట్లు ఇవ్వడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ఏపీ కోసం.. తెలంగాణ కోసం.. వికసిత్ భారత్ కోసం 400 సీట్లు కావాలి
400 దాటాలి.. బీజేపికి ఓటు వేయాలి.. అని తెలుగులో చెప్పిన మోదీ
తెలంగాణలో బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొట్టుకుపోతాయి
రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ తెలంగాణ: ప్రధాని మోదీ
రాహుల్‌పై ఓ రేంజిలో..!
తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని
నా తెలంగాణ కుటుంబసభ్యులకు నమస్కారాలు అన్న మోదీ
జగిత్యాల వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మోదీ తీవ్ర విమర్శలు
శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ.. తన పోరాటం శక్తికి వ్యతిరేకంగా అని చెప్పారు
నాకు ప్రతి మహిళా ఒక శక్తిస్వరూపంలా కనిపిస్తుంది
నేను భారతమాతకు పూజారిని.. శక్తిని ఖతమ్ చేస్తానన్న రాహుల్ ఛాలెంజ్‌ను నేనే స్వీకరిస్తున్నా
చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతాన్నికి కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్నాం
శక్తిని వినాశనం చేసేవాళ్లకు.. శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరగబోతోంది
శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో.. జూన్ 4న తెలుస్తుంది : ప్రధాని మోదీ
హ్యాట్రిక్ కొట్టాల్సిందే.. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందేనని ప్రధాని మోదీ (PM Narendra Modi) వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు విచ్చేసిన మోదీ.. రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. సోమవారం నాడు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాలలో ‘విజయ సంకల్ప’ సభలో మోదీ పాల్గొన్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సభావేదికగా ప్రధాని మోదీ రాష్ట్రం గురించి ఏం మాట్లాడుబోతున్నారు..? కాంగ్రెస్ వంద రోజుల పాలనపై ఎలా స్పందిస్తారు..? తెలంగాణకు ఏం చేయబోతున్నారు..? అనే విషయాలపై ప్రధాని ప్రసంగం ఎలా ఉండబోతోందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తుండటంతో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై (Kavitha Arrest) ప్రధాని స్పందిస్తారా..? లేదా..? అనేది చూడాలి. మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) లో చూసేయండి..
Updated Date - Mar 18 , 2024 | 12:34 PM