ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Medaram Jatara: మేడారం జాతర.. విద్యాసంస్థలకు 4 రోజులు సెలవులు..

ABN, Publish Date - Feb 21 , 2024 | 09:20 AM

రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం, అనంతరం ఈ జాతర జరగుతుండటంతో రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ మొదటిసారి అధికారం చేపట్టడం, అనంతరం ఈ జాతర జరగుతుండటంతో రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతరను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మేడారం జాతర కోసం నాలుగు వేలకు పైగా బస్సులను సిద్ధం చేసింది. ఈ జాతర కోసం ఏకంగా ఓ రైలునే ఏర్పాటు చేయడం విశేషం. ఈ రైలు కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు నడుస్తుంది. దీంతో నేటి నుంచి జాతర ప్రారంభమైంది. ఈ రోజు తొలిఘట్టం ఆవిష్కృతం కానుంది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారానికి పోటెత్తారు.

ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరగనున్నందున ములుగు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. ఐదో రోజు ఆదివారం పబ్లిక్ హాలిడే కావడంతో మొత్తంగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి.


మరోవైపు.. భక్తుల రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. హైదరాబాద్‌ నుంచి జాతరకు వెళ్లాలనుకునే భక్తులు ముందుగా వరంగల్‌కు రావాలి. ములుగు-ఏటూరునాగారం రహదారిపై హనుమకొండ నుంచి 85 కిలోమీటర్లు ప్రయాణిస్తే పస్రా వస్తుంది. అక్కడి నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే మేడారం చేరుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 21 , 2024 | 11:41 AM

Advertising
Advertising