ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Osmania University: ఓయూలో మళ్లీ ‘వన్‌టైమ్‌ చాన్స్‌’

ABN, Publish Date - Jul 12 , 2024 | 03:45 AM

నిర్ణీత గడువులోగా బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేయలేక మరోసారి రీఅడ్మిషన్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని దిగులుపడుతున్న పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు శుభవార్త.

  • 2000-2019 మధ్య బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసేందుకు అవకాశం

హైదరాబాద్‌ సిటీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): నిర్ణీత గడువులోగా బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేయలేక మరోసారి రీఅడ్మిషన్‌ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని దిగులుపడుతున్న పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీతోపాటు అనుబంధ కాలేజీల్లో పీజీ చదివి సకాలంలో బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసుకోలేని విద్యార్థులు మరోసారి పరీక్షా రాసుకోవచ్చు. ఓయూ స్టాండింగ్‌ కమిటీ నిర్ణయం మేరకు 2000-2001 నుంచి 2018-19 మధ్యవివిధ విద్యా సంవత్సరాల్లో చదివిన విద్యార్థులు బ్యాక్‌లాగ్స్‌ను క్లియర్‌ చేసుకోవడానికి ‘వన్‌ టైమ్‌ చాన్స్‌’ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంఎ్‌సడబ్ల్యూ, ఎంఎల్‌ఐఎస్సీ, బీఎల్‌ఐఎస్సీ, ఎంసీజే కోర్సుల మొదటి, రెండో, మూడో, నాలుగో సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 16వతేదీ వరకు వన్‌ టైమ్‌ చాన్స్‌ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు గడువిచ్చారు.


రూ.500 జరిమానాతో ఆగస్టు 28వరకు ఫీజు చెల్లించవచ్చు. వన్‌ టైమ్‌ చాన్స్‌ రుసుము, పరీక్ష ఫీజుతోపాటు గతంలో హాల్‌టికెట్‌, మార్కుల మెమోల కాపీలను జతపర్చాలని విద్యార్థులకు సూచించారు. వివరాలకు వర్సిటీ ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌లో సంప్రదించాలని, వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. ఓయూకు అనుబంధంగా రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పీజీ కాలేజీల విద్యార్థులతోపాటు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో నాడు ఓయూ అనుబంధంగా కొనసాగిన ప్రైవేటు, ప్రభుత్వ పీజీ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది. వన్‌ టైమ్‌ చాన్స్‌పై విద్యార్థులు పలుమార్లు వర్సిటీ అధికారుల దృష్టికి తేవడంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వన్‌ టైమ్‌ చాన్స్‌తో వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని వర్సిటీ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - Jul 12 , 2024 | 03:45 AM

Advertising
Advertising
<