ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Patnam Sunita Mahender Reddy: నేను లోకల్‌.. రాగిడి నాన్‌లోకల్, డమ్మీ క్యాడిండేట్‌

ABN, Publish Date - Apr 13 , 2024 | 11:07 AM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జెడ్పీ చైర్‌ పర్సన్‌గా పని చేసిన నేను లోకల్‌ అని, వరంగల్‌కు చెందిన రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) డమ్మీ క్యాడిండేట్‌ అని పట్నం సునీతా మహేందర్‌రెడ్డి(Patnam Sunita Mahender Reddy) అన్నారు.

- ప్రచారంలో మల్కాజిగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతారెడ్డి

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జెడ్పీ చైర్‌ పర్సన్‌గా పని చేసిన నేను లోకల్‌ అని, వరంగల్‌కు చెందిన రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) డమ్మీ క్యాడిండేట్‌ అని పట్నం సునీతా మహేందర్‌రెడ్డి(Patnam Sunita Mahender Reddy) అన్నారు. శుక్రవారం మండల కేంద్రం కీసరలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ అధ్యక్షతన కీసర మండల కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరి వర్థన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంత్‌రావు, నక్క ప్రభాకర్‌ గౌడ్‌లు విచ్చేశారు. ఈ సందర్భంగా మాల్కాజ్‌గిరి నియోజకవర్గం(Malkajgiri Constituency) కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్‌ నేను లోకల్‌ కాదని చివాకులు పలుకుతున్నాడు. ఉమ్మడి రంగారెడ్డి జల్లాకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసి, మేడ్చల్‌ నియోజకవర్గం(Medchal Constituency) కోసం దాదాపు 3 వందల కోట్ల రూపాయాలు కేటాయించానని ఆమె తెలిపారు. అసలైన డమ్మీ అభ్యర్థి బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన రాగిడి లక్ష్మారెడ్డి అని, అతను వరంగల్‌కు చెందిన వారని అన్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి నాన్‌లోకల్‌ అని, బీజేపీ తన ఉనికి చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నారు. గత ఎంపీ ఎన్నికలో రేవంత్‌రెడ్డి(Revanth Reddy)ని మెజార్టీతో గెలిపించిన ఘనత మాల్కాజ్‌గిరి పారమెంటుకు చెందిన ప్రజలదని, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలదన్నారు. అదే స్పూర్తితో రానున్న ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త సైనికుడి వల్లే పని చేయాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. సమావేశానికి ముందు ఆమె కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కీసర మండలానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Danam Nagender: కాంగ్రెస్ అభ్యర్థి ‘దానం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Updated Date - Apr 13 , 2024 | 11:08 AM

Advertising
Advertising