ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ghatkesar: ప్లాట్ల వివాదం.. మాజీ ఎంపీటీసీ హత్య!

ABN, Publish Date - Jun 25 , 2024 | 04:40 AM

ప్లాట్లకు సంబంధించిన ఓ వివాదం ఒకరి హత్యకు దారితీసింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్‌ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

  • ఘట్‌కేసర్‌లో కళ్లలో కారం చల్లి, కర్రలతో దాడి

  • మృతదేహం కొండాపూర్‌ డంప్‌యార్డ్‌లో పూడ్చివేత

  • నలుగురు నిందితుల అరెస్టు.. పరారీలో ఇద్దరు

ఘట్‌కేసర్‌ రూరల్‌/ఘట్‌ కేసర్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్లాట్లకు సంబంధించిన ఓ వివాదం ఒకరి హత్యకు దారితీసింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్‌ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని డంప్‌యార్డులో పాతిపెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రధాన నిందితులున్నారని, వీరికి మరో నలుగురు సహకరించారని పోలీసులు వెల్లడించారు. మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి వెల్లడించిన వివరాల ప్రకారం.. గడ్డం మహేశ్‌కు ఆయన ఉంటున్న కాలనీకే చెందిన శ్రీనివాస్‌ (36) అలియాస్‌ చిన్నతో ప్లాట్లకు సంబంధించి వివాదం నెలకొంది. 2019లో శ్రీనివా్‌సపై మహేశ్‌ పలు కేసులు పెట్టాడు. కోర్టు విచారణలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న శ్రీనివాస్‌, మహేశ్‌ పట్ల కక్ష పెంచుకొని అతడి హత్యకు పథకం వేశాడు.


ఈ విషయంలో తనకు సహకరించాలని తన కాలనీకే చెందిన కడుపోల్ల ప్రవీణ్‌ (24)ను సంప్రదించాడు. తన సమీప బంధువుతో మహేశ్‌ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో అప్పటికే ఆయనపై కక్ష పెంచుకున్న ప్రవీణ్‌ సహకరించేందుకు అంగీకరించాడు. ఈ నెల 14న పథకం ప్రకారం ఇద్దరూ కలిసి మహేశ్‌కు ఫోన్‌చేశారు. ఘట్‌కేసర్‌ బైపాస్‌ సమీపంలోని ఆయన రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయానికి తాము వస్తామని, అక్కడ ప్లాట్ల వివాదంపై చర్చించుకుందామని చెప్పారు. తాను ఆఫీసులో లేనని, హైదరాబాద్‌లో ఉన్నానని మహేశ్‌ చెప్పడంతో మరుసటి రోజు వస్తామని చెప్పారు. 15న ఉదయం మహేశ్‌ ఆఫీ్‌సకొచ్చారు.


మహేశ్‌ను మాటల్లో పెట్టి వెంట తెచ్చుకున్న కారం పొడిని ఆయన కళ్లలో చల్లి కర్రలతో తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత ఆఫీస్‌ షెటర్‌ను ఇద్దరూ కిందకు లాగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదేరోజు రాత్రి మరో ఇద్దరితో కలిసి శ్రీనివాస్‌, ప్రవీణ్‌.. ఆఫీసుకొచ్చారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి కొండాపూర్‌ సమీపంలోని డంపింగ్‌ యార్డు వద్ద ఎక్స్‌కవేటర్‌తో గుంతతీసి పాతిపెట్టారు. అప్పటికే మహేశ్‌ కోసం వెతుకుతున్న ఆయన తమ్ముడు గడ్డం విఠల్‌, ఈనెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహేశ్‌ ఫోన్లోని కాల్‌ డేటాను పరిశీలించి.. ఆయన చివరిసారిగా ఎవరితో మాట్లాడారు? అనే కోణంలో దర్యాప్తు చేశారు. పోలీసుల దర్యాప్తు విషయాన్ని తెలుసుకున్న శ్రీనివాస్‌, ప్రవీణ్‌.. ఆదివారం రాత్రి మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజారెడ్డి వద్ద లొంగిపోయి నేరాన్ని అంగీకరించారు.


శ్రీనివాస్‌, ప్రవీణ్‌తో పాటు వీరికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సోమవారం పోలీసులు మృతదేహాన్ని వెలికితీయించి, గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ప్రవీణ్‌ ఇంటి వద్ద మహేశ్‌ కుటుంబీకులు ఆందోళన నిర్వహించారు. కొన్నేళ్లుగా మహేశ్‌, తన భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. వారు అంత్యక్రియలకు రాకపోవడంతో ఆయన సోదరుడి కుమారుడు కౌషిక్‌ చితికి నిప్పంటించాడు.

Updated Date - Jun 25 , 2024 | 04:41 AM

Advertising
Advertising