ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Civil Court: లడ్డూలపై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు తొలగించాలి

ABN, Publish Date - Oct 15 , 2024 | 03:33 AM

రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం కె.పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలు

  • నాంపల్లి సిటీ సివిల్‌ కోర్టులో ‘పిల్‌’

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం కె.పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ నాంపల్లి సిటీ సివిల్‌ కోర్టులో సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. సామాజిక మాధ్యమాల్లోని ఆ వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ న్యాయవాది ఇమ్మనేని రామారావు ఈ పిల్‌ను దాఖలు చేశారు.


అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో కల్తీ నెయ్యి వినియోగించినట్టు ప్రజల్లో విద్వేషం పెంచేలా పవన్‌ కళ్యాణ్‌ ఆధారాలు లేని వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మరోసారి పవన్‌ కళ్యాణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిషేధ (గ్యాగ్‌) ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

Updated Date - Oct 15 , 2024 | 03:33 AM