ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ts Politics: ఆ నాలుగు నగరాల పేర్లు మార్చండి.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ ఎమ్మెల్యే

ABN, Publish Date - Feb 15 , 2024 | 01:24 PM

బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కొన్ని నగరాల పేర్లను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని సూచించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధాన పర మార్పులు చేస్తుంది. రాష్ట్రం పేరు తెలంగాణ స్టేట్‌ను (TS) టీజీగా (TG) మార్చిన సంగతి తెలిసిందే. చిహ్నాలను మారుస్తానని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొన్ని నగరాల పేర్లు (City Name) మార్చాలని డిమాండ్ వస్తోంది. ఆ నగరాల పేర్ల మార్పునకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభ్యుడు ప్రతిపాదన చేశారు.

ఆ నాలుగు నగరాలు ఇవే..

బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. కొన్ని నగరాల పేర్లను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని సూచించారు. భాగ్యలక్ష్మి గుడి పేరుతో భాగ్యనగరం అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. బాగ్ నగర్ అంటారని కొందరు, భాగమతి అని మరికొందరు చెబుతారు. హైదరాబాద్ పేరు మార్పు గురించి ఇదివరకు చాలా మంది నేతలు కూడా ప్రతిపాదించారు.

AP Politics: ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా..? ఏపీ సీఎం జగన్‌పై షర్మిల ధ్వజం

నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చాలని బీజేపీ ఎమ్మెల్యే సూర్య నారాయణ అభిప్రాయ పడ్డారు. ఇదివరకు నిజామాబాద్ పేరు ఇందూరుగా ఉండేది. ఆ తర్వాత దానిని నిజామాబాద్‌గా మార్చారు. ఆదిలాబాద్ పేరును ఎదులాపురంగా మార్చాలని కోరారు. వరంగల్‌ పేరును ఓరుగల్లుగా మార్చాలని సూచించారు. ఈ నాలుగు నగరాల పేర్లను మార్చేలా చూడాలని రేవంత్ ప్రభుత్వాన్ని సూర్య నారాయణ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2024 | 01:24 PM

Advertising
Advertising