PM Modi Live Updates: ఎల్బీనగర్ స్టేడియంలో మోదీ అదిరిపోయే స్పీచ్
ABN, Publish Date - May 10 , 2024 | 06:25 PM
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో (TS Lok Sabha Elections) 10 నుంచి 12 సీట్లు గెలవాలన్నదే టార్గెట్‌గా కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఊహించని రీతిలోనే సీట్లు వస్తాయని బీజేపీ అగ్రనేతలు చెబుతున్న పరిస్థితి. అందుకే.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు..
తెలంగాణలో బీజేపీ ఫినిషింగ్ టచ్
ఎల్బీ స్టేడియం సభలో తన ప్రసంగంతో ఉర్రూతలూగించిన మోదీ
మోదీ ప్రసంగానికి కార్యకర్తల నుంచి విశేష స్పందన
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంపై విరుచుకుపడిన మోదీ
రిజర్వేషన్లపై హైదరాబాద్ వేదికగా మరోసారి క్లారిటీ ఇచ్చిన ప్రధాని
బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ముస్లిం రిజిస్ట్రేషన్లు తొలగిస్తామన్న మోదీ
తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని మోదీ ఆగ్రహం
తెలంగాణలో ముగిసిన ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం
బీజేపీని ఆశీర్వదించాలని ఎల్బీ స్టేడియం సభ ద్వారా తెలంగాణ ప్రజలను కోరిన మోదీ
హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ పర్యటనకు ప్రధానమంత్రి
శనివారం వికారాబాద్, వనపర్తి బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్ షా
ప్రధాని మోదీ సభా వేదిక మీదకు రాజాసింగ్‌కు నో ఎంట్రీ..
ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ సభా వేదిక మీదకు రాజసింగ్‌కు నో ఎంట్రీ.
లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో వేదిక మీదకు అనుతించలేదంటోన్న రాజసింగ్.
నిర్దేశించిన సమయం కంటే ఆలస్యంగా వచ్చిన కారణంగా అనుమతించలేదంటోన్న పోలీసులు.
దీంతో కార్యకర్తల మధ్యలో కూర్చుని మోదీ సభను వీక్షించిన రాజసింగ్.
గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఎల్బీ స్టేడియం ఉంది.
నాకు హైదరాబాద్ చాలా ప్రత్యేకం: ప్రధాని మోదీ
హైదరాబాద్, సికింద్రబాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థులకు నమస్కారం.
తెలంగాణకు ఎయిమ్స్, వందేభారత్ రైళ్లు ఇచ్చిందెవరు?
తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ఒక్కటే మాట వినిపిస్తోంది
కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ వద్దు, మజ్లిస్ వద్దు.
కాంగ్రెస్ పాలనలో ఎక్కడికి వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేది.
ఇక్కడ మరో ఆర్ ట్యాక్స్ కూడా ఉంది.
అదే రజాకార్ ట్యాక్స్
జూన్ 4న దేశం గెలుస్తుంది.
దేశ సంకల్పం గెలుస్తుంది.
లూటీ లూటీ లూటీ ఇదే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్: ప్రధాని మోదీ
వారసత్వ రాజకీయాలే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్.
గతంలో బాంబు పేళుళ్లు జరిగేవి.. ఇప్పుడు జరుగుతున్నాయా?
ఢిల్లీలో బలమైన ప్రభుత్వం వచ్చే పేళ్లు ఆగిపోయాయి.
కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే మళ్లీ పాత రోజులను ఆహ్వానించడమే.
మీ సంపదను లాక్కునేవారు కావాలా? సంపదను పెంచేవారు కావా?
రాముడికి పూజ చేయడం తప్పా? దేశ ద్రోహమా?
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో (TS Lok Sabha Elections) 10 నుంచి 12 సీట్లు గెలవాలన్నదే టార్గెట్‌గా కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఊహించని రీతిలోనే సీట్లు వస్తాయని బీజేపీ అగ్రనేతలు చెబుతున్న పరిస్థితి. అందుకే.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు భారీ బహిరంగ సభల్లోనడం, ర్యాలీలు నిర్వహించడం.. అభ్యర్థులను గెలిపించాలని సుదీర్ఘ ప్రసంగాలు చేసిన పెద్దలు.. రెండ్రోజుల్లో పోలింగ్ ఉండటంతో మరింత జోరు పెంచారు. శుక్రవారం నాడు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ విచ్చేశారు. దీంతో తెలంగాణలో పలు ప్రాంతాల నుంచి.. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలను నేతలు తరలించారు. మోదీ ప్రసంగాన్ని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్‌లో చూసేద్దాం రండి..
Updated Date - May 10 , 2024 | 06:42 PM