TG POLITICS: బిల్లులు ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తా..పోచారం కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 20 , 2024 | 10:05 PM
పెండింగులో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇంటి బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్, కోటగిరి, రుద్రూరు మండల కేంద్రాల్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్‌తో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
నిజామాబాద్: పెండింగులో ఉన్న బాన్సువాడ నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇంటి బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్, కోటగిరి, రుద్రూరు మండల కేంద్రాల్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లలో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్‌తో కలిసి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్లను కేవలం బాన్సువాడ నియోజకవర్గానికి మాత్రమే మంజూరు చేసిందని తెలిపారు.
TG Politics: నన్ను టచ్ చేస్తే మాడి మసైపోతావ్.. కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
అందులో 10,000 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు గత ప్రభుత్వంలో రూ. 400 కోట్ల బిల్లులు ఇప్పించానని గుర్తుచేశారు. ప్రభుత్వం మారిన తర్వాత పెండింగ్‌లో ఉన్న రూ. 26 కోట్ల బిల్లులు ఇవ్వాలని కాంగ్రెస్ మంత్రిని కోరితే, ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ మంత్రి దగ్గరకు వెళ్లి బిల్లులు ఇవ్వొద్దని చెప్పారని తనకు తెలిసిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రూ. 400 కోట్ల బిల్లులు ఇప్పించానని.. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 30 కోట్ల బిల్లులను కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
Nalgonda: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కష్టమే.. గుత్తా సంచలన వ్యాఖ్యలు
తనను నమ్ముకుని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారని... వారి బాధ తాను చూడలేనని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లోపు బిల్లులు రాకపోతే మే 13వ తేదీన ఓటింగ్ తర్వాత లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తానని హెచ్చరించారు. అయినా ప్రభుత్వం స్పందించక బిల్లులు ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని... తనకు ఇంతకు మించి మరో ప్రత్యామ్నాయం లేదని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి
Etela Rajender: బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే నష్టమే తప్ప, లాభం లేదు..
BJP: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటన
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 20 , 2024 | 10:26 PM