TS Politics: తెలంగాణలో హీటెక్కుతున్న పాలిటిక్స్.. రైతులే టార్గెట్‌గా వార్
ABN, Publish Date - Apr 03 , 2024 | 09:26 AM
తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. రైతులే టార్గెట్‌గా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మూడునెలల పాలనలో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణలో పాలిటిక్స్ రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. రైతులే టార్గెట్‌గా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మూడునెలల పాలనలో పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇక్కడి నుంచి రైతులే టార్గెట్‌గా వార్ ప్రారంభమైంది. ఇటీవల జనగామ, సూర్యాపేట్, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పొలం బాట నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ఆరోపణలకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Fire Accident: అటు ఆయిల్ గోదాం.. ఇటు ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం..
ఆరోపణలు కాదు ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలివ్వాలని సీఎం రేవంత్ డెడ్ లైన్ విధించారు. 48 గంటల్లోగా వివరాలివ్వాలని రేవంత్ సవాల్ విసిరారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను ప్రభుత్వం తరపున పరిహారం ఇచ్చి ఆదుకుంటామని రేవంత్ తెలిపారు. 209 మంది రైతులు చనిపోయారంటూ వివరాలను మాజీ మంత్రి హరీశ్ రావు విడుదల చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ విడుదల చేయాలని విజ్ఙప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 03 , 2024 | 09:35 AM