ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి

ABN, Publish Date - Dec 31 , 2024 | 05:33 AM

విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సర్వ శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మెను విరమించుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క సూచించారు. సమ్మెను విరమించుకుంటే... వారి ఇబ్బందులను ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.

  • సర్వ శిక్ష ఉద్యోగులకు మంత్రులు పొన్నం, సీతక్క సూచన

హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సర్వ శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులు చేస్తున్న సమ్మెను విరమించుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క సూచించారు. సమ్మెను విరమించుకుంటే... వారి ఇబ్బందులను ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. గత 25 రోజులుగా వీరు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సోమవారం అధికారులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే సమ్మెను విరమించాలని సూచించారు.


సమ్మె చేయడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని కేజీబీవీ పాఠశాలల్లో బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుతున్నారని గుర్తుచేశారు. తాము సుదీర్ఘ కాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో పని చేస్తున్నామని, తమని రెగ్యులరైజ్‌ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్‌ అమలుచేయాలని సర్వ శిక్ష ఉద్యోగులు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. సర్వ శిక్ష కస్తూర్బా గాంధీ పాఠశాలలు కేంద్రం పరిధిలో 60 శాతం, రాష్ట్రం పరిధిలో 40 శాతం ఉంటాయని, ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు మంత్రి పొన్నం ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - Dec 31 , 2024 | 05:33 AM