Traffic Violations: నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్సు రద్దు
ABN, Publish Date - Sep 09 , 2024 | 03:50 AM
మద్యం సేవించి వాహనాలు నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా, ఇతరత్రా నిబంధనలు ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరిస్తున్నామని,
రవాణా సిబ్బందికి ప్రమోషన్లు ఇస్తాం: మంత్రి పొన్నం
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి వాహనాలు నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా, ఇతరత్రా నిబంధనలు ఉల్లంఘించినా కఠినంగా వ్యవహరిస్తున్నామని, డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మోటారు వాహనాల చట్టానికి అనుగుణంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 6936 డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశామన్నారు.
ఆదివారం రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏటా వేలాది మంది చనిపోతన్నారనీ, దీన్ని నివారించేందుకు రోడ్డు భద్రతపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. రవాణా శాఖ ఉద్యోగులకూ ప్రమోషన్లు ఇస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Updated Date - Sep 09 , 2024 | 03:50 AM