Ponnam Prabhakar: బీజేపీకి రూ.500 కోట్లు ఇచ్చినందుకే శరత్ చంద్రారెడ్డికి బెయిల్
ABN, Publish Date - Apr 18 , 2024 | 10:32 AM
బీజేపీకి ఐదు వందల కోట్లు ఇచ్చినందుకే అరెస్టయిన అరబిందో డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాండ్ల విషయంలో బీజేపీ సమర్ధించుకుంటున్న తీరు గర్హనీయమన్నారు. అవినీతి డబ్బు పార్టీలకు వస్తే అది నీతివంతంగా మారిపోతుందా? అని ప్రశ్నించారు.
కరీంనగర్: బీజేపీ BJP)కి ఐదు వందల కోట్లు ఇచ్చినందుకే అరెస్టయిన అరబిందో డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డికి బెయిల్ మంజూరైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాండ్ల విషయంలో బీజేపీ సమర్ధించుకుంటున్న తీరు గర్హనీయమన్నారు. అవినీతి డబ్బు పార్టీలకు వస్తే అది నీతివంతంగా మారిపోతుందా? అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు బీజేపీ సహకరించలేదన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చిందో చెప్పాలని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
Hyderabad: రా.. రమ్మంటున్న రైల్ మ్యూజియం.. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ఉచిత ప్రవేశం
వేములవాడ, కొండగట్టు ప్రసాదం స్కీం కింద ఒక్క రూపాయి అయినా ఆయిన తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు. రాముడి పేరు మీద రాజకీయం చేస్తున్నారని పొన్నం మండిపడ్డారు. రాముడిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఒకవేళ తాను రాముడి గురించి తప్పుగా ఏమైనా మాట్లాడినట్టు బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే తాను సజీవ దహనానికి సైతం సిద్ధమన్నారు. తాము రాముడిని ఆరాధిస్తాం కానీ రాజకీయాలు చేయబోమని తెలిపారు. తెలంగాణలో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని పొన్నం వ్యాఖ్యానించారు.
Bhadradri: నేడు భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
Updated Date - Apr 18 , 2024 | 10:33 AM