ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అమెరికాలో తెలుగోళ్ల హవా,,

ABN, Publish Date - Jun 28 , 2024 | 05:16 AM

ఇంట్లో తెలుగు.. వీధిలో తెలుగు.. యునివర్సిటీలో తెలుగు.. కార్యాలయంలోనూ తెలుగే.. ఇదేదో ఆంధ్రానో, తెలంగాణో అనుకుంటే పొరబడినట్టే! అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలికాలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది.

  • అగ్రరాజ్యంలో పెరుగుతున్న మనోళ్ల సంఖ్య

  • 8 ఏళ్లలో నాలుగు రెట్ల పెరుగుదల

  • 2016లో 3.2 లక్షలు.. 2024లో 12.3 లక్షలు

  • ఆ దేశంలో ఎక్కువ మంది మాట్లాడే 350 విదేశీ భాషల్లో తెలుగుది 11వ స్థానం

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో తెలుగు.. వీధిలో తెలుగు.. యునివర్సిటీలో తెలుగు.. కార్యాలయంలోనూ తెలుగే.. ఇదేదో ఆంధ్రానో, తెలంగాణో అనుకుంటే పొరబడినట్టే! అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవలికాలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇది. ఆ దేశంలో ఎక్కువ మంది మాట్లాడే 350 విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో నిలిచింది. అమెరికాలో ఎక్కువగా మాట్లాడే భారతీయ భాషల జాబితాలో మనకన్నా ముందు హిందీ, గుజరాతీ ఉన్నాయి. కొన్నాళ్లుగా.. ఉన్నత విద్య, ఉపాధి కోసం ఇతర దేశాల నుంచి అమెరికాకు చేరుకుంటున్నవారిలో తెలుగువారి జనాభా గణనీయంగా పెరుగుతోంది. అమెరికా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేస్తున్నాయి. 2016తో పోలిస్తే 2024లో అమెరికాలో ఉంటున్న తెలుగువారి జనాభా నాలుగింతలు పెరిగిందని ఇటివలే విడుదలైన యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో డేటా చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం..


  • 2016లో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 3.2 లక్షలు ఉండగా..ఇప్పుడది 12.3 లక్షలకు చేరింది.

  • తెలుగు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో క్యాలిఫోర్నియా ప్రథమస్థానంలో ఉంది. అక్కడ 2 లక్షల మంది తెలుగువారున్నారు. తర్వాతటెక్సస్‌(1.5 లక్షలు), న్యూజెర్సీ(1.1లక్షలు), ఇల్లినాయ్‌(83 వేలు), వర్జీనియా(78వేలు), జార్జియా(52 వేలు) ఉన్నాయి.

  • అమెరికాకు ఏటా వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల్లో తెలుగు విద్యార్థుల వాటా దాదాపు 13 శాతం.

  • ఉపాధి కోసం వెళ్లేవారి సంఖ్యలోనూ ఏటా వృద్ధి నమోదవుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ నుంచి అత్యధికులు అమెరికాకు వెళ్తుండగా.. వీరిలో సింహభాగం తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు.

  • అమెరికాలోని అనేక ప్రముఖ వర్సిటీల్లోని విదేశీ విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల వాటా పెరుగుతోంది. కెంట్‌ స్టేట్‌ వర్సిటీలో మనోళ్ల ప్రవేశాలు ఎక్కువగా ఉండడంతో ‘విద్యార్థులకు స్వాగతం’ అంటూ తెలుగులో ఆహ్వానం పలకడం పట్ల మన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • ఏటా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి 60 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు, 10 వేల మందికి పైగా హెచ్‌1బీ వీసాపై అమెరికాకు చేరుకోవడమే అక్కడ మన హవా ఇంతగా పెరడగానికి ప్రధాన కారణం. ఇండియన్‌ మొబిలిటీ రిపోర్ట్‌-2024 ప్రకారం.. చదువుకోవడానికి అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో మన తెలుగువారి వాటా ఏకంగా12.5 శాతం!!


వృద్ధిరేటులో మనమే..

అమెరికాలో ఉండే అన్ని దేశాలవారు, జాతులవారు బయట మాట్లాడేది ఆంగ్లమైనా.. ఇంట్లో మాట్లాడేది మాత్రం మాతృభాషే. అలా ఆ దేశంలో ఉంటున్న భారతీయుల్లో.. ఇంట్లో మాతృభాష మాట్లాడే వారి సంఖ్య పెరుగుదలలో తెలుగువారిదే అగ్రస్థానం. 2010లో అక్కడ 2.17 లక్షల మంది ఇంట్లో తెలుగు మాట్లాడుతుండగా.. 2021 నాటికి వారి సంఖ్య 111 శాతం వృద్ధి రేటుతో 4.59 లక్షలకు చేరింది


మాతృ భాష 2010 2021 వృద్ధి (శాతం)

తెలుగు 217641 459836 111.00%

తమిళం 181698 341396 88.00%

బెంగాలీ 221872 403024 82.00%

నేపాలీ, మరాఠీ,

ఇండో-ఆర్యన్‌ భాషలు 275694 447811 63.00ు

హిందీ 609395 864830 42.00%

మళయాళం, కన్నడ,

ఇతర ద్రావిడ భాషలు 197550 280188 42.00%

ఉర్దూ 388909 507972 31.00%

పంజాబీ 243773 318588 31.00%

గుజరాతీ 356394 436909 23.00%

Updated Date - Jun 28 , 2024 | 05:16 AM

Advertising
Advertising