KA Paul: నేను శపించడం వల్లే కేసీఆర్ ఓడిపోయారు.. జైలుకు వెళ్లే వాళ్లకు అధికారం అప్పగిస్తారా
ABN, Publish Date - Feb 11 , 2024 | 02:19 PM
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ చేసిన కామెంట్లు ఇంట్రెస్టింగ్ గా మారాయి. తాను శపించడం వల్లే కేసీఆర్, కేటీఆర్ ఓడిపోయారని చెప్పారు. తన దీవెనల వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని చెప్పారు. సొంత ఛారిటీ కింద ఐదు లక్షల కోట్ల రూపాయలు పంచినట్లు తెలిపారు. సొంత చార్టెడ్ ఫ్లైట్స్ లో తిరిగిన తను ఇప్పుడు ప్రపంచాన్ని వదలిపెట్టి పల్లెల్లో తిరుగుతున్నానన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే తిరగడం ప్రపంచంలోనే ఎనిమిదో వింత అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అవినీతిని వేలెత్తి చూపిస్తున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాశాంతి పార్టీకి 54 శాతం ఓటు బ్యాంకు ఉందని అన్ని ఛానల్స్ సర్వే నివేదికలు వేశాయని కేఏ.పాల్ వివరించారు.
"ఎన్టీఆర్, బాలయోగికి భారతరత్న ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ కు బీజేపీతో అంటకాగాల్సిన అవసరం ఏముంది. ప్రజారాజ్యం ద్వారా చిరంజీవి సీఎం అనుకుంటే కాంగ్రెస్ కు అమ్మేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం మోదీ, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు. ప్రశ్నిస్తామని పార్టీ పెట్టి 25 సీట్లకు అమ్ముడుపోయారు. చంద్రబాబును బిల్ గేట్స్ కు పరిచయం చేసింది నేనే. చంద్రబాబు నాతో ఎన్నిసార్లు భేటీ అయ్యారో చెప్పాలి. జగన్ సిద్ధం- పవన్ మేమూ సిద్ధం-చంద్రబాబు సంసిద్ధం అంటున్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీకి ఎలా అమ్ముడుపోయారో అర్దం కావడం లేదు. ఆంధ్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం ప్రధాని మోదీ ఏం చేశారో పురంధేశ్వరి చెప్పాలి" అని కేఏపాల్ డిమాండ్ చేశారు.
చంద్రబాబుపై 60 కేసులు, కోర్టుల్లో స్టేలు ఉన్నాయి. జగన్ పై 32 కేసులు ఉన్నాయి. ప్రజాశాంతి పార్టీ మాత్రమే ప్రజలకు మంచి చేస్తుంది. ఏపీలో లేని బీజేపీ కోసం టీడీపీ, జనసేన ఎందుకు పరుగులు పెడుతున్నాయి. ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. బొత్స సత్యనారాయణ లక్ష కోట్ల రూపాయలు దోచుకుకున్నారు. ఒకప్పుడు ఆర్ధిక ఇబ్బందులతో బొత్స సతీమణి నన్ను కలిస్తే ప్రేయర్ చేశాను. నేనొస్తే వాళ్ల ఓటమి తప్పదనే భయంతోనే విశాఖలో నన్ను అడ్డుకుంటున్నారు.
- కేఏ.పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 11 , 2024 | 02:19 PM