ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Prof. Haragopal: అభివృద్ధి పేరిట విధ్వంసంతో ముప్పు

ABN, Publish Date - Aug 15 , 2024 | 03:18 AM

విధ్వంసాన్ని మిగిల్చే అభివృద్ధి నమూనాలో మానవాళి ఇరుక్కుపోయిందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

  • ఈ ప్రమాదకర నమూనాలో మానవాళి ఇరుక్కుపోయింది

  • ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆవేదన

  • పటాన్‌చెరు-బొల్లారం కాలుష్యంపై ‘ఒక విధ్వంసం’ పుస్తకావిష్కరణ

  • ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు పుస్తకాన్ని అంకితమిచ్చిన రచయిత

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): విధ్వంసాన్ని మిగిల్చే అభివృద్ధి నమూనాలో మానవాళి ఇరుక్కుపోయిందని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంపద సృష్టి పేరుతో ప్రకృతి వనరులను తరువాతి తరాలకు మిగల్చకుండా సాగుతున్న విధ్వంసం ఎక్కడికి దారి తీస్తుందన్న విషయంపై తాత్విక, చారిత్రక దృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఔషధ పరిశ్రమలు మందులు కన్నా ఎక్కువగా రోగాలను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. పటాన్‌చెరు-బొల్లారం కాలుష్య వ్యతిరేక పోరాటంపై సీనియర్‌ జర్నలిస్టు సమయమంత్రి చంద్రశేఖర శర్మ ఆంధ్రజ్యోతిలో రాసిన కథనాల సమాహారం ‘ఒక విధ్వంసం-1056/90’ పుస్తకాన్ని బుధవారం అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో హరగోపాల్‌ ఆవిష్కరించారు.


తొలి ప్రతిని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివా్‌సకు అందించారు. హరగోపాల్‌ దీన్ని ఒక దుఃఖభరితమైన పుస్తకంగా వర్ణించారు. పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లోని ఫార్మా బాధితుల వేదనను, జీవన విధ్వంసాన్ని ఈ పుస్తకం ద్వారా చరిత్రలో నమోదు చేశారని రచయితను ప్రశంసించారు. రాజకీయ ఒత్తిళ్లకు వెరవకుండా ‘ఆంధ్రజ్యోతి’ యాజమాన్యం ఇలాంటి సాహసోపేతమైన వార్తలు, కథనాలను ప్రచురించడం అభినందనీయమని కొనియాడారు. కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఈ పుస్తకం చదివితే మానవ కల్పిత ఉత్పాతాలతో ధరిత్రి ఎదుర్కొంటున్న మహాప్రమాదాల గురించి తెలుస్తుందన్నారు.


అభివృద్ధి వాదం ఉధృతమై, పర్యావరణ ప్రస్తావనే అపచారమైపోతున్న రోజుల్లో ఈ పుస్తకం అవసరమన్నారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధికి పటాన్‌చెరు ‘శాక్రిఫైస్‌ జోన్‌’గా మారిందని పర్యావరణవేత్త కలపాల బాబూరావు అన్నారు. పారిశ్రామిక వ్యర్థాలు మూసీ లో కలవడంతో వందకుపైగా గ్రామాలు దుష్ప్రభావాలకు లోనయ్యాయని హెచ్‌సీయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జీ విజయ్‌ చెప్పారు. పర్యావరణ ఉద్యమకారిణి సరస్వతీ కవుల సభాధ్యక్షత వహించారు. సీనియర్‌ జర్నలిస్టు రాజశుక పుస్తకాన్ని పరిచయం చేశారు.


  • ఒత్తిళ్లను లెక్కచేయకుండా ఆర్కే అండగా నిలిచారు: చంద్రశేఖరశర్మ

పటాన్‌చెరు-బొల్లారం పారిశ్రామికవాడలోని కొన్ని రసాయన పరిశ్రమల వల్ల తలెత్తిన కాలుష్యంపై ప్రత్యేక కథనాలు, వార్తలు రాయడానికి ‘ఆంధ్రజ్యోతి’ తనను ప్రోత్సహించిందని రచయిత సమయమంత్రి చంద్రశేఖర శర్మ చెప్పారు. తద్వారా బాధితుల గోడును బయట ప్రపంచానికి తెలియజేయగలిగానని తెలిపారు.


ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చినా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ లెక్కచేయకుండా తనకు వెన్నుదన్నుగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇచ్చినట్లు తెలిపారు. ఆయనకు బదులుగా హాజరైన ఆంధ్రజ్యోతి ప్రతినిధి పి.శశికాంత్‌ పుస్తకాన్ని స్వీకరించారు.

Updated Date - Aug 15 , 2024 | 03:18 AM

Advertising
Advertising
<