ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మట్టి మిద్దె మింగేసింది..

ABN, Publish Date - Jul 02 , 2024 | 03:53 AM

నిలువ నీడగా ఉన్న ఇల్లే నిండు కుటుంబాన్ని బలిగొంది. మట్టిమిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ శిథిలాలు నిద్రిస్తున్న ఐదుగురిపై పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

  • వానకు తడిసి కుప్పకూలిన పైకప్పు

  • నిద్రలోనే తల్లి, ముగ్గురు చిన్నారుల దుర్మరణం

  • స్వల్పగాయాలతో బయటపడ్డ ఇంటిపెద్ద

  • నాగర్‌కర్నూల్‌ జిల్లా వనపట్లలో విషాదం

  • వానకు తడిసి తెల్లవారుజామున కుప్పకూలిన పైకప్పు

  • తల్లి, ముగ్గురు చిన్నారుల దుర్మరణం

నాగర్‌కర్నూల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): నిలువ నీడగా ఉన్న ఇల్లే నిండు కుటుంబాన్ని బలిగొంది. మట్టిమిద్దె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ శిథిలాలు నిద్రిస్తున్న ఐదుగురిపై పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సోమవారం ఈ ఘోరం జరిగింది. రూరల్‌ మండలం వనపట్ల గ్రామానికి చెందిన గొడుగు భాస్కర్‌ ఆటో డ్రైవర్‌. అతడికి భార్య పద్మ (26), కవల కూతుళ్లు పప్పి (6), వసంత (6), కుమారుడు విక్కీ (1) ఉన్నారు. ఈ కుటుంబం తమ పూర్వీకులకు సంబంధించిన మట్టిమిద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆ ఇంటికి ఉన్న దూలాల్లో ఒకటి కొన్నాళ్ల క్రితమే విరిగిపోయింది. పైగా ఆదివారం కురిసిన వర్షానికిమిద్దె పూర్తిగా తడిసిపోయింది. ఆదివారం రాత్రి ఇంట్లో పద్మ, ముగ్గురు పిల్లలు నిద్రించారు. భాస్కర్‌ బీరువా పక్కన పడుకున్నాడు.


సోమవారం తెల్లవారుజామున మట్టిమిద్దె కూలిపోయింది. భాస్కర్‌ స్వల్ప గాయాలతో శిధిలాల నుంచి బయటకొచ్చి చుట్టుపక్కల ఉన్న బంధువులకు విషయం చెప్పాడు. వారంతా వచ్చి రాళ్లు, మట్టిని తొలగించి పద్మ, పప్పి, వసంత, విక్కీని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురూ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనాస్థలిని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పరిశీలించారు. అంత్యక్రియల నిమిత్తం 25 వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందించారు. మృతులకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Jul 02 , 2024 | 03:53 AM

Advertising
Advertising