ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rakhi festival: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ వేడుకలు

ABN, Publish Date - Aug 20 , 2024 | 04:37 AM

రాఖీ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంత్రి సీతక్క, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, మట్టా రాగమయి

  • రేవంత్‌కు రాఖీలు కట్టిన సీతక్క, దీపాదాస్‌

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రాఖీ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంత్రి సీతక్క, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, మట్టా రాగమయి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు బండ్రు శోభారాణి, నేరెళ్ల శారద, కాల్వ సుజాత తదితరులు సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీలు కట్టి.. ఆశీర్వాదం తీసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీతక్క, పర్ణికారెడ్డి, మట్టా రాగమయి.. రాఖీలు కట్టారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు ప్రజాపతి బ్రహ్మకుమారీలు, మహిళా సిబ్బంది, మహిళా పారిశుధ్య కార్మికులు రాఖీ కట్టారు.


ఈ సందర్భంగా ప్రజలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, హరీశ్‌బాబు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావుతోపాటు పలువురు నాయకులకు రాఖీలు కట్టారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో కేటీఆర్‌కు ములుగు జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ నాగజ్యోతి రాఖీ కట్టి, ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, థ్యాంక్యూ రేవంత్‌ అంకుల్‌ అంటూ.. పలువురు చిన్నారులు ఆయనకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.


అయితే వీరంతా వినికిడి సమస్యతో బాధపడుతూ.. ప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు కావడం గమనార్హం. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత.. వినికిడి సమస్యతో కొందరు పిల్లలు ఇబ్బందులు పడుతున్న విషయం ఆయన దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన సీఎం.. చిన్నారులకు వీలైనంత త్వరగా వైద్య సాయం అందించాలని ఆదేశించారు.


ఈ మేరకు కోఠిలోని ఈఎన్‌టీ ఆస్పత్రిలో శస్త్రచికిత్సలను ప్రారంభించగా.. చిన్నారులకు అవసరమైన వినికిడి యంత్రాలను సైతం ప్రభుత్వమే అందించింది. అనంతరం ఏడాదిపాటు ఆడిషన్స్‌ వెర్బల్‌ థెరఫీ (ఏవీటీ)ని కూడా అందించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈఎన్‌టీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న చిన్నారులు సచివాలయానికి వచ్చి.. సీఎం రేవంత్‌కు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.


  • రాఖీ కట్టేందుకు వచ్చి.. తిరిగిరాని లోకాలకు

ఖానాపూర్‌, ఆగస్టు 19 : రాఖీ కట్టేందుకు తమ్ముడి ఇంటికి వచ్చిన వృద్ధురాలు ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి మృతి చెందిన ఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం దిలావర్‌పూర్‌లో సోమవారం జరిగింది. లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌కు చెందిన రాళ్లబండి చిన్నమ్మ(70) ఆదివారం దిలావర్‌పూర్‌లోని తమ్ముడు ఇంటికి రాఖీ కట్టేందుకు వచ్చింది. సోమవారం ఉదయం బహిర్భూమి కోసమని గ్రామ శివారులో ఉన్న సదర్మాట్‌ కెనాల్‌ వైపు వెళ్లింది. కాల్వ కట్టపై నడుస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కెనాల్‌లో పడి మృతి చెందింది.

Updated Date - Aug 20 , 2024 | 04:38 AM

Advertising
Advertising
<