ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BRS: బీఆర్ఎస్‌కు ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్‌బై.. కార‌ణమిదే?

ABN, Publish Date - Mar 17 , 2024 | 12:10 PM

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ బీఆర్ఎస్‌కు వ‌రుస షాక్‌ల మీద షాక్‌లు త‌గుతున్నాయి. వ‌ర్థ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేష్ బీఆర్ఎస్‌ను వీడిన కొద్దిగంట‌ల్లోనే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ బీఆర్ఎస్‌కు వ‌రుస షాక్‌ల మీద షాక్‌లు త‌గుతున్నాయి. వ‌ర్థ‌న్న‌పేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి ర‌మేష్ బీఆర్ఎస్‌ను వీడిన కొద్దిగంట‌ల్లోనే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యoలో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ఎక్స్‌లో వెల్ల‌డించారు. ఈమేర‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజీనామా లేఖ‌ను పంపారు.

చేవెళ్ల ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఇప్ప‌టివ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, పార్టీ గౌర‌వ అధ్య‌క్షులు కేటీఆర్‌కు రంజిత్‌రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గ‌తంలో చెవేళ్ల నుంచి మ‌ళ్లీ రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీచేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. చెవేళ్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంలోనూ రంజిత్‌రెడ్డికే టికెట్ అని స్ప‌ష్టం చేశారు. అయితే ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు, లిక్క‌ర్ స్కామ్ కేసులో క‌విత అరెస్ట్ త‌ర్వాత బీఆర్ఎస్‌ను కీల‌క నేత‌లు వీడుతున్నారు. రంజిత్‌రెడ్డి భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఏమిట‌నేదానిపై ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కాని ఆయ‌న కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.

చేవెళ్ల నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా ఇప్ప‌టికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డిని ప్ర‌క‌టించారు. దీంతో ఇక్క‌డి నుంచి ఆయ‌న‌కు బీజేపీ టికెట్ వ‌చ్చే అవ‌కాశం లేదు. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ మ‌హేంద‌ర్ రెడ్డి భార్య సునీతా రెడ్డికి టికెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈక్ర‌మంలో రంజిత్ రెడ్డి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 01:06 PM

Advertising
Advertising