ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

R&B Department: ఆర్‌ అండ్‌ బీ శాఖలో బదిలీలు పూర్తి..

ABN, Publish Date - Aug 01 , 2024 | 03:14 AM

రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ శాఖలో అధికారుల బదిలీల ప్రక్రియ బుధవారం పూర్తయింది. 40శాతం మేర సిబ్బందినే బదిలీ చేయాలన్న నిబంధనతోపాటు స్పౌజ్‌ కోటా, వికలాంగులు, ఏడాదిలో పదవీ విరమణ పొందే వారితోసహా ఇతర నిబంధనలను పాటిస్తూ అధికారులు బదిలీ ప్రక్రియను పూర్తిచేశారు.

  • అటవీశాఖలో డీఎ్‌ఫవోలు, ఏసీఎ్‌ఫల బదిలీలు కూడా

  • నేటి నుంచి బదిలీలపై నిషేధం.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్‌ అండ్‌ బీ శాఖలో అధికారుల బదిలీల ప్రక్రియ బుధవారం పూర్తయింది. 40శాతం మేర సిబ్బందినే బదిలీ చేయాలన్న నిబంధనతోపాటు స్పౌజ్‌ కోటా, వికలాంగులు, ఏడాదిలో పదవీ విరమణ పొందే వారితోసహా ఇతర నిబంధనలను పాటిస్తూ అధికారులు బదిలీ ప్రక్రియను పూర్తిచేశారు. ఇందులో భాగంగా 24 మంది ఈఈలు, 86 మంది డిప్యూటీ ఈఈలు, ఏఈఈ/ఏఈలు మల్టీజోన్‌-1లో 71 మంది, మల్టీజోన్‌-2లో 76 మంది, ఎలక్ట్రికల్‌ విభాగంలో 2పోస్టులు.. మొత్తం 259 మంది బదిలీ అయ్యారు.


మరోవైపు అటవీశాఖలోనూ అఽధికారుల బదిలీ ప్రక్రియ పూర్తయింది. జిల్లా అటవీ అధికారులు (డీఎ్‌ఫవో), అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (ఏసీఎ్‌ఫ)ల స్థాయిల్లో 20మంది అధికారులకు స్థానచలనం కలిగింది. వీరిలో 8 మంది డిప్యూటీ కన్జర్వేటర్లు, 12 మంది అసిస్టెంట్‌ కన్జర్వేటర్లున్నారు. వీరు బుధవారం బాధ్యతలు చేపట్టారు. కాగా ఉద్యోగుల బదిలీలకు ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో ఆగస్టు 1వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Aug 01 , 2024 | 03:14 AM

Advertising
Advertising
<