ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Secretariat: సచివాలయం పార్కింగ్‌ నమూనా ఖరారు ..

ABN, Publish Date - May 25 , 2024 | 05:03 AM

సచివాలయంలో వాహనాల పార్కింగ్‌ నమూనాలను ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఖరారు చేశారు. సచివాలయానికి మూడువైపుల పార్కింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒక వైపు సాధారణ స్లాబ్‌తో మల్టీపర్పస్‌ పార్కింగ్‌ను, రెండువైపుల సోలార్‌ రూఫ్‌టా్‌పలతో పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

  • ఒకవైపు మల్టీపర్పస్‌, రెండువైపులా సోలార్‌ రూఫ్‌టాప్‌ల ఏర్పాటు

  • ఉత్పత్తయ్యే విద్యుత్తు సెక్రటేరియట్‌కే..

  • అంచనా రూ.40 కోట్లకు పెంపు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదలిక

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో వాహనాల పార్కింగ్‌ నమూనాలను ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఖరారు చేశారు. సచివాలయానికి మూడువైపుల పార్కింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒక వైపు సాధారణ స్లాబ్‌తో మల్టీపర్పస్‌ పార్కింగ్‌ను, రెండువైపుల సోలార్‌ రూఫ్‌టా్‌పలతో పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణాలను పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ‘వాహనాలకు నిలువ నీడ లేకపాయే’ అనే శీర్షికన ఏప్రిల్‌ 6వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక మొదలైంది. ఈ క్రమంలోనే వ్యయం ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ అవుతున్నట్లుగా వారి అంచనాల్లో తేలింది.


ఏప్రిల్‌లో వేసిన ప్రాథమిక అంచనాల్లో రూ.15 కోట్ల మేర ఖర్చవుతుందని తేలగా, తాజా అంచనాలు రూ.40 కోట్లకు పెరిగాయి. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు. సచివాలయ నిర్మాణ సమయంలో పార్కింగ్‌ సదుపాయాలపై దృష్టి సారించకపోవడంతో ఇప్పుడు అంచనా వ్యయం పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్‌లో ఉద్యోగులు వచ్చే మార్గం (ఎన్టీఆర్‌ గార్డెన్‌వైపున్న గేట్‌ నెం.4), వీఐపీలు, అధికారులు వచ్చే సౌత్‌ఈ్‌స్ట మార్గం (అమరుల స్తూపం ఎదురుగా ఉన్న మార్గం), మింట్‌ కాంపౌండ్‌ వైపున్న మసీదు, చర్చి మార్గం.. మొత్తం మూడు వైపులా పార్కింగ్‌కు అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ గార్డెన్‌వైపు ఉన్న పార్కింగ్‌ ప్రాంతంలో స్లాబ్‌ వేసి మల్టీపర్పస్‌ పార్కింగ్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.


ఈ విధానంలో కొన్ని కార్లు స్లాబ్‌ కింది భాగంలో ఉంటే, మరికొన్ని ఎంట్రీ గేటు నుంచే నేరుగా స్లాబ్‌ పైకి వెళ్తాయి. మిగిలిన రెండు మార్గాల్లో సోలార్‌ రూఫ్‌టాప్‌ విధానంలో పార్కింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. సోలార్‌ రూఫ్‌టాప్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సచివాలయంలోని పలు అవసరాలకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. మరోవైపు మంత్రులు, అధికారులను కలిసేందుకు వచ్చే సందర్శకులు సచివాలయం లోపలికి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాసులు జారీ చేసే కౌంటర్‌ నుంచి సౌత్‌ఈ్‌స్ట గేటు ఎంట్రీ పాయింట్‌కు, అక్కడి నుంచి సచివాలయంలోకి వెళ్లాలంటే కిలోమీటరుకు పైగా దూరం ఉంది. దీంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాసులు జారీ చేసే కౌంటర్‌ నుంచే సచివాలయంలోనికి నడిచి వెళ్లేలా మార్గాన్ని నిర్మించటంతోపాటు, వృద్ధులు, వికలాంగులకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - May 25 , 2024 | 05:03 AM

Advertising
Advertising