ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

ABN, Publish Date - Aug 06 , 2024 | 04:12 AM

ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి అక్రమంగా రూ.40 కోట్లు కొట్టేసిన కేసులో.. ప్రధాన నిందితుడు బషీద్‌కు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ)లో పనిచేసే ఓ అధికారి సహకారం ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు.

  • త్వరలో అతణ్ని విచారించే అవకాశం

  • తవ్వినకొద్దీ వెలుగులోకి బషీద్‌ మోసాలు

  • 12.50 కోట్ల ప్రాపర్టీ కొంటానని మోసం

  • ఆస్తి కొట్టేసి.. ఈ కేసులో ఇరికించిన బషీద్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి అక్రమంగా రూ.40 కోట్లు కొట్టేసిన కేసులో.. ప్రధాన నిందితుడు బషీద్‌కు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ)లో పనిచేసే ఓ అధికారి సహకారం ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామస్వామి, డెలివరీ మేనేజర్‌ రాజేశ్‌ను ఇప్పటికే ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేయగా.. బషీద్‌ను వారికి పరిచయం చేసింది సదరు ఆర్‌బీఐ అధికారి అని గుర్తించారు. ‘‘ఆర్‌బీఐలో పనిచేసే అధికారి ద్వారా మాకు బషీద్‌ పరిచయం అయ్యాడు.


బషీద్‌కు సహకరించాలని ఆ అధికారి సూచించారు. అందుకే అతనికి సహకరించాం’’ అని నిందితులిద్దరూ వాంగ్మూలం ఇవ్వడంతో.. పోలీసులు మూడ్రోజులు ఢిల్లీలో మకాం వేసి, ప్రధాన నిందితుడు, సినీ నిర్మాత బషీద్‌ను అరెస్టు చేశారు. నిందితులను కోర్టు అనుమతితో పోలీసు కస్టడీకి తీసుకుని, విచారించనున్నట్లు సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. కస్టడీలో ముఖాముఖి విచారిస్తే.. ఆర్‌బీఐ అధికారి పాత్ర బయటపడుతుందని అన్నారు. రూ.40 కోట్ల మోసంలో బషీద్‌ ఉదయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తిని అడ్డంగా బుక్‌ చేసి, అతని ఆస్తిని కొట్టేయడమే కాకుండా.. బాధితుడిని కూడా ఈ కేసులో ఇరికించినట్లు పోలీసులు గుర్తించారు. ఉదయ్‌కుమార్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌, యాప్రాల్‌లో రూ.12.50 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయన వాటిని అమ్మకానికి పెట్టారు.


విషయం తెలుసుకున్న బషీద్‌.. ఆ ఆస్తులను కొనుగోలు చేస్తానని నమ్మబలికాడు. అయితే.. ఇండ్‌సఇండ్‌ బ్యాంకులో ఖాతా తెరిస్తే.. లావాదేవీలు సులభమవుతాయని చెప్పాడు. దానికి ఉదయ్‌కుమార్‌రెడ్డి అంగీకరించడంతో.. బ్యాంకు అధికారులను పిలిపించి, ఖాతా తెరిపించాడు. ఆ తర్వాత ఖాతా ఆన్‌లైన్‌ యాక్సె్‌సను తీసుకున్న బషీద్‌.. ‘‘నాకు రూ.40 కోట్ల డబ్బు రావాల్సి ఉంది. వాటి బదిలీకి మీ ఖాతాను వాడుకుంటాను. మీకు రావాల్సిన రూ.12.50కోట్లు అందులో ఉంచి, మిగతావి వేరే ఖాతాలకు బదిలీ చేసుకుంటాను’’ అని చెప్పాడు. దాంతో ఉదయ్‌కుమార్‌రెడ్డి సరేనన్నారు.


ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి కొల్లగొట్టిన రూ.40 కోట్లను ఉదయ్‌కుమార్‌రెడ్డి ఖాతాకు బదిలీ చేశారు. ఆ డబ్బును చూపి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆస్తులను బషీద్‌ తన పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నాడు. ఆ తర్వాత రూ.40 కోట్లను వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశాడు. అయితే.. మోసం జరిగిన విషయాన్ని గుర్తించిన ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ అధికారులు సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తొలుత బుక్కయింది ఉదయ్‌కుమార్‌రెడ్డి. పోలీసులు అతణ్ని ప్రశ్నించగా.. రూ.12.50 కోట్లకు తన ఆస్తులను అమ్మానని, బషీద్‌ తన ఖాతాను వాడుకున్నాడని చెప్పారు.


బషీద్‌ అరెస్టయ్యాక ఈ ఆస్తుల విషయంలో ప్లేటు ఫిరాయించడం గమనార్హం. ‘‘నేను ఉదయ్‌కుమార్‌రెడ్డి ఖాతాను డబ్బు బదిలీకి వాడుకున్నది నిజమే. అయితే.. ఉదయ్‌కుమార్‌రెడ్డికి రూ.12.50కోట్ల నగదు ఇచ్చి ఆస్తులు కొన్నాను’’ అని చెబుతున్నట్లు తెలిసింది. బషీద్‌ బదిలీ చేసిన పలు ఖాతాలను గుర్తించిన పోలీసులు.. వాటిల్లోని రూ.37 కోట్లను ఫ్రీజ్‌ చేశారు.

Updated Date - Aug 06 , 2024 | 04:12 AM

Advertising
Advertising
<