ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మంచి రోజు.. రిజిస్ట్రేషన్ల జోరు

ABN, Publish Date - Dec 29 , 2024 | 03:33 AM

రిజిస్ట్రేషన్‌ శాఖకు శనివారం కాసుల వర్షం కురిసింది. రోజూ వారీ కంటే రెట్టింపు సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కావడంతో సమృద్ధిగా ఆదాయం సమకూరింది.

  • రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కిటకిట.. రాత్రి 8 గంటల తర్వాతా రద్దీ

  • కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకూ.. ఈ ఏడాదికి ఇదే మంచి రోజు అని ప్రజల భావన

  • 3 రోజుల తర్వాత ఆఫీసులు తెరచుకోవడం మరో కారణం.. రిజిస్ట్రేషన్‌లు రెట్టింపు

  • ఒక్క రోజే ప్రభుత్వానికి రూ.100 కోట్లకు పైగా ఆదాయం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్‌ శాఖకు శనివారం కాసుల వర్షం కురిసింది. రోజూ వారీ కంటే రెట్టింపు సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కావడంతో సమృద్ధిగా ఆదాయం సమకూరింది. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఓపెన్‌ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం రెండింతలకుపైగా క్రయ విక్రయదారులు తరలిరావడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. బుధ, గురువారాల్లో క్రిస్మస్‌ సెలవులు రాగా, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరణంతో శుక్రవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు వరుసగా రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలకు సెలవు రావడం ఒక కారణమైతే, శనివారం నాడు త్రయోదశి.. మంచి రోజని వినియోగదారులు భావించడమే రద్దీకి మరో కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 30, 31న పని దినాలే అయినప్పటికీ, సోమవారం అమావాస్య కావడం, ఆ తర్వాతి రోజు మంగళవారం కావడంతో రద్దీ అంతా ఒకే రోజు కనిపించిందని పేర్కొన్నారు. కొన్ని కార్యాలయాల్లో రాత్రి 8 గంటల తర్వాత కూడా రద్దీ తగ్గలేదు. సమయం మించిపోయినా వినియోగదారులను వెనక్కి పంపకుండా అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్‌ పక్రియ కొనసాగించారు. సాఽధారణంగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలన్నీ తమ వినియోగదారులకు డిసెంబరులోగా అపార్ట్‌మెంట్లు, విల్లాలను అప్పగించేలా అగ్రిమెంట్లు చేసుకుంటాయి. అలాగే, బ్యాంకర్లు సైతం తమ త్రైమాసిక రుణ లక్ష్యాలను చేరుకునేందుకు డిసెంబరులో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ముందుకు వస్తుంటాయి. ఈ రెండు కారణాల వల్ల కూడా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రద్దీ పెరిగిందని రియల్‌ఎస్టేట్‌ వర్గాలు చెప్పాయి.


రాష్ట్రంలో రెండింతలు..హైదరాబాద్‌లో ఇంకా ఎక్కువే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజూ వారీ కంటే రెట్టింపు సంఖ్యలో దాదాపుగా 12వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ జరిగింది. తద్వారా ప్రభుత్వానికి రూ.100కోట్లపైగానే ఆదాయం సమకూరినట్లు అంచనా వేస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి ఒక్క రోజే 2,900 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. సుమారుగా రూ.63కోట్లకుపైగా రాబడి వచ్చినట్లు భావిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని కొన్ని ముఖ్యమైన కార్యాలయాల్లో మూడింతలకుపైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ అయినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో రోజు వారీ రిజిస్ట్రేషన్‌ అయ్యే డాక్యుమెంట్లు సాధారణంగా 5వేల నుంచి 6వేల లోపే ఉంటాయి. కానీ.. శనివారం రాత్రి 9 గంటల సమయానికి రిజిస్ట్రేషన్ల సంఖ్య 12వేలు దాటింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని పటాన్‌చెరు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరగ్గా, మహేశ్వరం, గండిపేట, కుత్బుల్లాపూర్‌ కార్యాలయాలకు సైతం భారీగా డాక్యుమెంట్లు వచ్చినట్లు తెలుస్తోంది. గండిపేటలో సాధారణంగా రోజూ 70నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, శనివారం 230కి పైగా డాక్యుమెంట్లు రావడం విశేషం. గండిపేట ఎస్సార్‌వోలో 150పైగా, కుత్బుల్లాపూర్‌లో 140పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో..

జిల్లా డాక్యుమెంట్లు సమకూరిన ఆదాయం

హైదరాబాద్‌ 400 రూ.27కోట్లు

మేడ్చల్‌ 1,000 రూ.16కోట్లు

రంగారెడ్డి 1,500 రూ.27కోట్లు

Updated Date - Dec 29 , 2024 | 03:33 AM