అత్యాచార బాధితుల కోసం పునరావాస కేంద్రం
ABN, Publish Date - Aug 30 , 2024 | 03:28 AM
లైంగిక వేధింపులకు గురైన బాలికలకు అండగా నిలిచేందుకు తరుణి అనే స్వచ్ఛంద సంస్థ రాష్ట్రంలోనే తొలిసారిగా ఓ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
తరుణి స్వాలంబన పేరిట హైదరాబాద్‌లో ఏర్పాటు
దిల్‌సుఖ్‌నగర్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): లైంగిక వేధింపులకు గురైన బాలికలకు అండగా నిలిచేందుకు తరుణి అనే స్వచ్ఛంద సంస్థ రాష్ట్రంలోనే తొలిసారిగా ఓ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. తరుణి స్వాలంబన పేరిట హైదరాబాద్, చైతన్యపురి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ పునరావాస కేంద్రాన్ని డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ సీఈవో శ్రీరమణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘తరుణి’ డైరెక్టర్ డాక్టర్ మమత రఘవీర్ మాట్లాడుతూ.. ఈ పునరావాస కేంద్రం ద్వారా అత్యాచార బాధితులకు పునరావాసం కల్పించడంతోపాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని తెలిపారు. అలాగే, బాధితులు తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతోపాటు వైద్య సాయం అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తరుణి నేషనల్ డైరెక్టర్, రిటై ర్డ్ ఐఎ్‌ఫఎస్ అధికారి రఘవీర్ మాట్లాడుతూ అత్యాచార బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కాగా, లైంగిక వేధింపులకు గురై గర్భం దాల్చిన బాలికలకు తమ ఆస్పత్రిలో ఉచితంగా ప్రసవాలు చేస్తున్నామని ఫెర్నాండెజ్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఏవిటా ఫెర్నాండెజ్ తెలిపారు.
Updated Date - Aug 30 , 2024 | 03:30 AM